వ్యాక్సినేషన్‌పై అభినందనలు : కలెక్టర్‌ మిశ్రా

ABN , First Publish Date - 2021-06-22T07:21:08+05:30 IST

జిల్లాలో ఆదివారం 1,65,939 మంది కి కొవిడ్‌ టీకా వేయడం ద్వారా దేశం లోని 730 జిల్లాలకంటే ముందు వరుసలో ఉందని, ఇందుకు కారణ మైన ప్రతి ఒక్క అధికారి, సిబ్బందిని కలెక్టర్‌ కార్తికేయ మిశ్రా అభినందించారు.

వ్యాక్సినేషన్‌పై అభినందనలు : కలెక్టర్‌ మిశ్రా

ఏలూరు, జూన్‌ 21 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఆదివారం  1,65,939 మంది కి కొవిడ్‌ టీకా వేయడం ద్వారా దేశం లోని 730 జిల్లాలకంటే ముందు వరుసలో ఉందని, ఇందుకు కారణ మైన ప్రతి ఒక్క అధికారి, సిబ్బందిని కలెక్టర్‌ కార్తికేయ మిశ్రా అభినందించారు. కలెక్టరేట్‌ నుంచి సోమవారం ఆయన కొవిడ్‌, హౌసింగ్‌, ఉపాధిహామీ పథకాలపై వీడియో సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్‌ ఫోన్‌ చేసి అభినందించారని తెలిపారు. గృహ నిర్మాణాల ప్రారంభ ప్రక్రియ నిరంతరాయంగా ఇదే స్ఫూర్తితో కొనసాగాలన్నారు. ఉపాధి హామీలో పోలవరం, నల్లజర్ల, ద్వారకా తిరుమల మండలాల్లో కార్మికుల హాజరు శాతం తగ్గడంపై ఆయన ఎంపీడీవోలను వివరణ కోరారు. జేసీలు వెంకటరమణారెడ్డి, హిమాన్షు శుక్లా, సూరజ్‌ ధనుంజయ్‌ తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-06-22T07:21:08+05:30 IST