పెండింగ్‌లో 600 స్పందన అర్జీలు

ABN , First Publish Date - 2022-06-28T06:34:04+05:30 IST

నవ్య తూర్పుగోదావరి జిల్లాలో ఇప్పటి వరకూ స్పందనకు వచ్చిన ఆర్జీలలో 600 పరిష్కారం కాలేదని.. వీటిలో 72 అర్జీలు మళ్లీ వచ్చాయని కలెక్టర్‌ మాధ వీలత తెలిపారు.

పెండింగ్‌లో 600 స్పందన అర్జీలు
కలెక్టర్‌ మాధవీలతకు వినతిపత్రం అందించిన మాజీ ఎమ్మెల్యే పెందుర్తి

పరిష్కరించాలని కలెక్టర్‌ మాధవీలత ఆదేశం

సోమవారం మరో 142 అర్జీలు స్వీకరణ


ధవళేశ్వరం, జూన్‌ 27 : నవ్య తూర్పుగోదావరి జిల్లాలో ఇప్పటి వరకూ స్పందనకు వచ్చిన ఆర్జీలలో 600 పరిష్కారం  కాలేదని.. వీటిలో 72 అర్జీలు మళ్లీ వచ్చాయని కలెక్టర్‌ మాధ వీలత తెలిపారు. అర్జీలను ఎందుకు పరిష్కరించలేక పోతు న్నామో తెలియజేస్తూ సహేతుకమైన వివరణ ఇవ్వాల్సి ఉం టుందని అధికారులకు స్పష్టం చేశారు. కలెక్టరేట్‌లో సోమ వారం నిర్వహించిన స్పం దనలో జేసీ శ్రీధర్‌తో కలిసి కలెక్టర్‌ ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు.142 ఫిర్యాదులు రాగా వాటిని శాఖల వారీగా అందజేసి సత్వరం పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కారానికే స్పందన కార్య క్రమం నిర్వహిస్తున్నామన్నారు. డివిజన్‌, మండల స్థాయి  పరిధిలో ఆయా శాఖలకు సంబంధించిన అధికారులు సమ స్యలను సకాలంలో పరిష్కరించి అర్జీదారులకు న్యాయం చేయాలన్నారు. స్పందన కార్యక్రమంలో అధికారులు డి. సుబ్బారావు, డీఎంహెచ్‌వో డాక్టర్‌ స్వర్ణలత, సీపీవో రాము, సివిల్‌ సప్లయిస్‌ డీఎం కె. తులసి, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఎస్‌ఈ రమేష్‌, డ్వామా పీడీ జగదాంబ, డీపీవో సత్యనారాయణ, హౌసింగ్‌ అధికారి ప్రేమ్‌చంద్‌ తదితరులు పాల్గొన్నారు.

అక్రమ తవ్వకాలపై చర్యలు చేపట్టండి : పెందుర్తి

రాజానగరం, జూన్‌ 27 : రాజానగరం నియోజకవర్గంలోని మూడు మండలాల్లో ప్రభుత్వ, ప్రైవేటు కొండలు, ఇసుక, మట్టి అక్రమ తవ్వకాలపై చర్యలు తీసుకోవాలంటూ మాజీ ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్‌ కలెక్టర్‌ మాధవీలతను కోరారు. ఈ మేరకు సోమవారం స్పందనలో వినతిపత్రం అంద జేశారు. రాజానగరం, సీతానగరం, కోరుకొండ మండలాల్లో ప్రభుత్వ, ప్రైవేటు కొండలను అక్రమ మార్గాల్లో పర్యావరణా నికి తూట్లు పొడుస్తూ సుమారు రూ.40 కోట్లు మేర ప్రభుత్వ ఆదాయానికి నష్టం కలిగించారన్నారు. కొండగుంటూరు, సంప త్‌నగరం,జి.యర్రంపాలెం,పాతతుంగపాడు,నామవరం, మున గాల, కణుపూరు, కోటికేశవరం, కూనవరం, కాటవరం, నల్గొండ గ్రామాల పరిధిలోని కొండల మట్టిని అక్రమంగా తవ్వి రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులకు విక్రయించారన్నారు. న్నారు. సరైన అనుమతుల్లేకుండా చెరువుల్లోని మట్టిని నిబం ధనలకు విరుద్ధంగా తవ్వి రూ.10 కోట్ల మేర ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టారన్నారు. జేపీ సంస్థ వచ్చిన నాటి నుంచి సీతానగరం మండలంలో ఇసుక అక్రమాలు మరింత పెరిగిపోయాయన్నారు.కాటవరం, మునికూడలి, ఇనగంటి వారిపేట, ముగ్గుళ్ల, సింగవరం, వంగలపూడిలో రాత్రి వేళల్లో రోజుకు రూ.కోటి విలువ చేసే అక్రమ ఇసుక వ్యాపారం జరుగుతుందన్నారు. గత ప్రభుత్వంలో అనుమతులు ఇచ్చి, నిలిచిపోయిన అనేక అభివృద్ధి పనులను కొనసాగించాల న్నారు.20 రకాల అభివృద్ధి పనులకు సంబంధించి అంశాలపై వినతి పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో గంగిశెట్టి చంటి బాబు, సంగుల శ్రీను, దూది కాంతారావు, ఖండవల్లి లక్ష్మి, చిట్టూరి రంగారావు తదితరులు ఉన్నారు.

ఎస్పీ స్పందనకు 30 ఫిర్యాదులు 

రాజమహేంద్రవరం సిటీ, జూన్‌ 27: వేధింపుల కేసులపై ప్రత్యేక దృష్టి సారించాలని ఎస్పీ ఐశ్వర్యరస్తోగి ఆదేశించారు. రాజమహేంద్రవరం జిల్లా ఎస్‌పి   కార్యాలయంలో సోమవారం నిర్వహించిన స్పందన కార్యక్రమంలో 30 మంది  నుంచి ఫిర్యాదులను అందించారు. ఎస్పీ కార్యాలయానికి జిల్లాలో వివిద ప్రాం తాల నుంచి చేరుకున్న ప్రజలు పలు సమస్యలపై సమస్యలను విన్నవిం చారు. వాటిని పరిశీలించిన ఎస్పీ పరిష్కారానికి చర్యలు చేపట్టారు.ఆయా పోలీస్‌ స్టేషన్లకు ఫిర్యాదులను పంపారు. వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. లేకపోతే ఎందుకు పరిష్కరించలేకపోయారో వివరణ ఇవ్వాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీలు,డీఎస్పీలు, సీఐలు పాల్గొన్నారు. 


Updated Date - 2022-06-28T06:34:04+05:30 IST