వాహన రుణాలను వెంటనే మంజూరు చేయండి

ABN , First Publish Date - 2021-01-17T05:52:31+05:30 IST

ఇంటి వద్దకు నిత్యావసర సరుకుల పంపిణీకి సంబంధించి అవసరమైన వాహన రుణాలను వెంటనే మంజూరు చేయాలని కలెక్టర్‌ వీరపాండియన్‌ ఆదేశించారు.

వాహన రుణాలను వెంటనే మంజూరు చేయండి

  1.  టెలికాన్ఫరెన్స్‌లో కలెక్టర్‌ వీరపాండియన్‌


 కర్నూలు(అర్బన్‌), జనవరి 16: ఇంటి వద్దకు నిత్యావసర సరుకుల పంపిణీకి సంబంధించి అవసరమైన వాహన రుణాలను వెంటనే మంజూరు చేయాలని కలెక్టర్‌ వీరపాండియన్‌ ఆదేశించారు. శనివారం సాయంత్రం కలెక్టర్‌ క్యాంప్‌ కార్యాలయం నుంచి నిత్యావసర సరకుల పంపిణీ వాహనాలపై ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కార్పొరేషన్‌ ఈడీలతోపాటు ఎంపీడీవో, మున్సిపల్‌ కమిషనర్లతో టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ బ్యాంకర్లు లబ్ధిదారుల దరఖాస్తులను తిరస్కరించవద్దన్నారు. సీఎం జగన్మోహన్‌రెడ్డి లబ్ధిదారుల ఇంటి వద్దకే నిత్యావసర సరుకులు పంపిణీ చేయడానికి అవసరమైన వాహనాలను ప్రారంభిస్తున్నారని తెలిపారు. ఈనెల 20న ఎస్టీబీసీ కళాశాల మైదానంలో సన్న బియ్యం పంపిణీకి వాహనాలను ప్రారంభిస్తామన్నారు. జేసీలు రామసుందర్‌రెడ్డి, ఖాజా మొహిద్దీన్‌, ఈడీలు చంద్రశేఖర్‌, శిరీష, పర్వీన్‌భాను, ఎంపీడీవోలు, కమిషనర్లు పాల్గొన్నారు.

Updated Date - 2021-01-17T05:52:31+05:30 IST