పుర ఎన్నికలు సజావుగా నిర్వహించేలా చర్యలు కలెక్టర్‌ హరినారాయణన్‌

ABN , First Publish Date - 2021-03-03T05:14:58+05:30 IST

మరో వారం రోజుల్లో జరగనున ్న మున్సిపల్‌ ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు పటిష్ఠ చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ ఎం.హరినారాయణన్‌ ఆదేశించారు.

పుర ఎన్నికలు సజావుగా నిర్వహించేలా చర్యలు  కలెక్టర్‌ హరినారాయణన్‌
మాట్లాడుతున్న కలెక్టర్‌ హరినారాయణన్‌

  చిత్తూరు కలెక్టరేట్‌, మార్చి 2: మరో వారం రోజుల్లో జరగనున ్న మున్సిపల్‌ ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు పటిష్ఠ చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ ఎం.హరినారాయణన్‌ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌ నుంచి మున్సిపల్‌ ఎన్నికల నిర్వహణపై మున్సిపల్‌ అధికారులు, నోడల్‌ ఆఫీసర్లతో వీడియో కాన్పరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఇటీవల తిరుపతి లో జరిగిన సమావేశంలో మున్సిపల్‌ ఎన్నికల్లో ఎక్కడా లోటుపాటు లేకుండా చర్యలు తీసుకోవాలని ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌  సూచించారన్నారు. ఎన్నికల విధుల్లో ఉండే అధికారులు చెక్‌లిస్ట్‌ పక్రారం తమ విధులను ప్రణాళికబద్ధంగా నిర్వహించాలన్నారు. ఓటర్ల సమస్యను పరిష్కరించేందుకు ప్రతి మున్సిపాలిటీలో ఫెసిలిటేషన్‌ సెంటర్లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఓటర్లువందశాతం తమ ఓటు హక్కును వినియోగించుకునే రీతిలో చర్యలు చేపట్టాలన్నారు. అన్ని పోలింగ్‌ కేంద్రాల్లో వెబ్‌క్యాస్టింగ్‌ చేస్తున్నట్లు ప్రకటించారు. జేసీ వీరబ్రహ్మం మాట్లాడుతూ బీఎల్వోల ద్వారా ఓటరు స్లిప్పుల పంపిణీ చేయాలని సూచించారు.  ఈ కార్యక్రమంలో తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్‌ గిరీష,  డీఆర్వో మురళి, చిత్తూరు కమిషనర్‌ విశ్వనాథ్‌, జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల కమిషనర్లు పాల్గొన్నారు.

 వారం రోజుల్లో జరగనున్న మున్సిపల్‌ ఎన్నికలను సజావుగా నిర్వహించాలని కలెక్టర్‌ హరినారాయణన్‌ సూచించారు. మంగళవారం పీవీకేఎన్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జరిగిన ఆర్వో, ఏఆర్వో, పోలింగ్‌ సిబ్బందికి ఒక రోజు శిక్షణా తరగతులకు ముఖ్య అతిథిగా హాజరైన క లెక్టర్‌ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో పోలింగ్‌ అధికారులకు విశేష అధికారాలు ఉంటాయని, వాటిని తెలుసుకోవాలంటే ముందుగా ఎన్నికల నియమావళిని క్షుణ్ణంగా అధ్యయనం చేయాలన్నారు.  ఈ కార్యక్రమంలో ఏసీ శ్రీలక్ష్మీ, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2021-03-03T05:14:58+05:30 IST