సచివాలయాల్లో మెరుగైన సేవలందించండి

Published: Thu, 18 Aug 2022 00:39:15 ISTfb-iconwhatsapp-icontwitter-icon
సచివాలయాల్లో మెరుగైన సేవలందించండి సచివాలయాల సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకుంటున్న కలెక్టర్‌ దిల్లీరావు

సచివాలయాల్లో మెరుగైన సేవలందించండి

 కలెక్టర్‌ దిల్లీరావు 

కలెక్టరేట్‌, ఆగస్టు 17 : సచివాలయాల్లో ప్రజలకు మెరుగైన సేవలందించేందుకు సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్‌ ఎస్‌.దిల్లీరావు అన్నారు.

 పటమటలోని ఖన్నా నగర్‌ 65, 66 వార్డు సచివాలయాలను బుధవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సచివాలయంలో రికార్డులను పరిశీలించి, అందిస్తున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. వివిధ సంక్షేమ పథకాల అమలు తీరును ఆరా తీస్తూ అర్హత ఉన్న ప్రతి లబ్ధిదారుడికి పథకాల లబ్ధి చేకూరాలని సూచించారు.

నిర్మాణాలను త్వరగా పూర్తి చేయండి

అజిత్‌సింగ్‌నగర్‌ : అదనపు తరగతి గదుల నిర్మాణాన్ని త్వరగా చేపట్టి పూర్తి చేయాలని కలెక్టర్‌ దిల్లీరావు అధికారులను ఆదేశించారు. పటమటలోని కోనేరు బసవయ్య చౌదరి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో అదనపు తరగతి గదుల నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని బుధవారం కలెక్టర్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రూ. కోటి 8 లక్షల నిధులతో చేపట్టనున్న 9 అదనపు తరగతి గదుల నిర్మాణాలకు పరిశీలించిన స్థలంలో పనులను ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. మాజీ ఎమ్మెల్యే యలమంచిలి రవి పాల్గొన్నారు. 

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.