20వ తేదీ లోపు క్లెయిమ్‌లు పరిష్కరించాలి

ABN , First Publish Date - 2021-12-02T05:53:51+05:30 IST

ఓటర్‌ జాబితాల స్పెషల్‌ సమ్మరి రివిజన్‌-2022కి సంబంధించి అందిన క్లెయిమ్‌లను పారదర్శకంగా పరిశీలించి ఈ నెల 20వ తేదీ లోపు పరిష్కరించాలని గుంటూరు, కృష్ణా జిల్లాల రోల్‌ అబ్జర్వర్‌ కేవీ రమణ ఆదేశించారు.

20వ తేదీ లోపు క్లెయిమ్‌లు పరిష్కరించాలి
సమీక్షకు హాజరైన కలెక్టర్‌, జేసీ, ఇతర అధికారులు

గుంటూరు, డిసెంబరు 1(ఆంధ్రజ్యోతి): ఓటర్‌ జాబితాల స్పెషల్‌ సమ్మరి రివిజన్‌-2022కి సంబంధించి అందిన క్లెయిమ్‌లను పారదర్శకంగా పరిశీలించి ఈ నెల 20వ తేదీ లోపు పరిష్కరించాలని గుంటూరు, కృష్ణా జిల్లాల రోల్‌ అబ్జర్వర్‌ కేవీ రమణ ఆదేశించారు. బుధవారం సాయంత్రం కలెక్టరేట్‌లో జరిగిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ పెదకూరపాడు, చిలకలూరిపేట, మంగళగిరిలలో ఎక్కువగా వచ్చిన క్లెయిమ్‌లను నిబంధనల మేరకు పరిష్కరించాలన్నారు. సమావేశంలో కలెక్టర్‌ వివేక్‌యాదవ్‌, జేసీ(రెవెన్యూ) దినేష్‌కుమార్‌, తెనాలి సబ్‌కలెక్టర్‌ నిధి మీన, నగరపాలక సంస్థ కమిషనర్‌ చల్లా అనురాధ, ఆర్‌డీవోలు, కాంగ్రెస్‌ పార్టీ ప్రతినిధి అడవి ఆంజనేయులు, తెలుగుదేశం పార్టీ ప్రతినిధి శివరామయ్య,   బీజేపీ నుంచి సీహెచ్‌ కుమార్‌గౌడ్‌,  సీపీఐ ప్రతినిధి కె.ఈశ్వరరావు, బీఎస్పీ ప్రతినిధి సీహెచ్‌ వాసు పాల్గొన్నారు.  


  

Updated Date - 2021-12-02T05:53:51+05:30 IST