Advertisement

ప్రకృతి వనం, రైతు వేదికలను పరిశీలించిన కలెక్టర్‌

Oct 15 2020 @ 02:20AM

మాక్లూర్‌, అక్టోబరు14: మండలంలోని గొట్టుముక్కల, మాక్లూర్‌ గ్రామాల్లో నిర్మిస్తున్న రైతు వేదిక, పల్లె ప్రకృతి వనాలను బుధవారం కలెక్టర్‌ నారాయణరెడ్డి పరిశీలిం చారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో రై తు వేదికలను ఈ నెల 20వ తేదీలోపు పూర్తి చేయాలని ఆదేశించారు. లేదంటే సంబంధిత పంచాయతీ శాఖ అధికారులపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ ఆదేశిం చారు. పక్కా ప్లాన్‌ ప్రకారం రైతు వేదికల పనులు జరిగే విధంగా స్థానిక తహసీల్దార్లు మానిటరింగ్‌ చేయాలని, రైతు వేదికలను దసరాలోపు ప్రారంభించేలా తహసీల్దార్‌ చర్యలు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో నిజామాబాద్‌ ఆర్డీవో రవి, సర్పంచ్‌లు గంగాధర్‌, రామా రావు, తహసీల్దార్‌ సీహెచ్‌.ఆంజనేయులు, ఎంపీడీవో సక్రియనాయక్‌, తదితరులు ఉన్నారు.

Follow Us on:
Advertisement

ఆంధ్రప్రదేశ్ మరిన్ని...

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.