అనంతపద్మనాభస్వామిని దర్శించుకున్న కలెక్టర్‌

Sep 17 2021 @ 00:32AM
కలెక్టర్‌ నిఖిలకు అనంతపద్మనాభస్వామి జ్ఞాపికను అందజేస్తున్న అర్చకుడు

వికారాబాద్‌,(ఆంధ్రజ్యోతి): శ్రీఅనంతపద్మనాభస్వామిని కలెక్టర్‌ నిఖిల దర్శించుకున్నారు. గురువారం రాత్రి అనంతగిరికి వెళ్లిన ఆమె తన కుమారుడితో కలిసి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. తొలిసారి దేవాలయానికి వచ్చిన కలెక్టర్‌కు అర్చకులు స్వామివారి చిత్రపటాన్ని బహూకరించారు. అనంతరం స్థలపురాణం, స్వామివారి విశిష్టతను కలెక్టర్‌కు వివరించారు.

Follow Us on: