Advertisement

గ్రామాల్లో పర్యటించిన కలెక్టర్‌

Mar 6 2021 @ 00:54AM
గ్రామాల్లో అభివృద్ధి పనులను పరిశీలిస్తున్న కలెక్టర్‌ రాహుల్‌ రాజ్‌

కెరమెరి, మార్చి 5: మండలంలోని పరందోళి, అంతాపూర్‌, కోట, బోలాపటార్‌, ఎస్సాపూర్‌ తదితర వివాదాస్పద గ్రామాల్లో శుక్రవారం కలెక్టర్‌ రాహుల్‌ రాజ్‌ పర్యటించి ప్రజల అభిప్రాయాన్ని తెలుసుకు న్నారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న కల్యాణ లక్ష్మి, ఆసరా తదితర సంక్షేమ పథకాలు అందుతు న్నాయా అని గ్రామస్థులను అడిగి తెలుసుకున్నారు. తెలంగాణ ప్రభుత్వ ఫలాలే ఎక్కువగా పొందుతున్నా మని వారు కలెక్టర్‌ దృష్టికి తీసుకు వచ్చారు. తమకు పట్టాలు లేకపోవడం వల్ల రైతుబంధుతో పాటు వ్యవ సాయపరంగా నష్టపోతున్నామన్నారు.అలాగే మహా రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి కలెక్టర్‌ అడిగితెలుసుకున్నారు. అలాగేఆయా గ్రామాల్లో పల్లె ప్రకృతివనాలను పరిశీలిం చారు. తెలంగాణ ప్రభుత్వం ద్వారా పల్లెల్లో నూతన ఒరవడి సృష్టించేందుకు పల్లెప్రకృతి వనా లతోపాటు స్మశానవాటిక, డంపిం గ్‌యార్డు, సెగ్రిగేషన్‌షెడ్‌, క్రిమిటో రీయం తదితర పనులు చేపడు తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఆయనవెంట తహసీల్దార్‌ సమీర్‌ అహ్మద్‌ఖాన్‌,ఎంపీడీవో దత్తారాం, ఎంపీవో మహేందర్‌రెడ్డి, నగేష్‌, కార్యదర్శులు నగేష్‌, కార్యదర్శి రమేష్‌ ఉన్నారు.

Follow Us on:
Advertisement