AP News: ఇంద్రకీలాద్రిపై నేరుగా రంగంలోకి దిగిన కలెక్టర్

ABN , First Publish Date - 2022-10-01T23:26:59+05:30 IST

Vijayawada: దసరా శరన్నవరాత్రోత్సవాల సందర్భంగా దుర్గమ్మ దర్శనానికి భక్తులు పోటెత్తారు. ఇదే సమయంలో కొందరు భక్తులు వీఐపీల రెఫరెన్స్‌తో వస్తున్నారు. కాదనలేక దేవస్థానం సిబ్బంది వారికి దర్శన ఏర్పాట్లు దగ్గరుంచి చూస్తున్నారు. దీంతో సామాన్య భక్తులకు అమ్మవారి దర్శనం ఆలస్యమవుతోంది. ఇదే విషయాన్ని కొందరు

AP News:  ఇంద్రకీలాద్రిపై నేరుగా రంగంలోకి దిగిన కలెక్టర్

Vijayawada: దసరా శరన్నవరాత్రోత్సవాల సందర్భంగా దుర్గమ్మ దర్శనానికి భక్తులు పోటెత్తారు. ఇదే సమయంలో కొందరు భక్తులు వీఐపీల రెఫరెన్స్‌తో వస్తున్నారు. కాదనలేక దేవస్థానం సిబ్బంది వారికి దర్శన ఏర్పాట్లు దగ్గరుంచి చూస్తున్నారు. దీంతో సామాన్య భక్తులకు అమ్మవారి దర్శనం ఆలస్యమవుతోంది. ఇదే విషయాన్ని కొందరు భక్తులు కలెక్టర్ దిల్లీరావుకు ఫిర్యాదు చేశారు. దీంతో నేరుగా ఆయనే రంగంలోకి దిగారు. అధికారులనుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. రిఫరెన్సుల పేరుతో వచ్చే వాళ్ల వల్లే దర్శనం ఆలస్యమవుతుందని గుర్తించారు. దీంతో ఓం టర్నింగ్, చిన రాజగోపురం వద్ద అధికారులకు గైడ్ లైన్స్ జారీ చేశారు. వీఐపీ రిఫరెన్స్ పేరుతో వచ్చే వారిని నేరుగా వెనక్కు పంపించేయాలని సిబ్బందికి సూచించారు. 

Updated Date - 2022-10-01T23:26:59+05:30 IST