కలెక్టరేట్‌ నిర్మాణ పనులను త్వరగా పూర్తిచేయాలి

ABN , First Publish Date - 2022-10-04T04:03:18+05:30 IST

ఈ ఏడాది డిసెంబరు చివరి నాటికి నస్పూర్‌లో నిర్మిస్తున్న కలెక్టరేట్‌ భవన సముదాయాన్ని ప్రారంభించేందుకు అవసరమైన చర్యలను చేపట్టాలని రాష్ట్ర రవాణా, రోడ్లు, భవనాల శాఖ ప్రిన్సిపల్‌ సెక్రెటరీ కేఎస్‌ శ్రీనివాసరాజు సూచిం చారు. నస్పూర్‌లో నిర్మిస్తున్న కలెక్టరేట్‌ భవన సము దాయం సమావేశ మందిరం, కలెక్టర్‌ చాంబర్‌, ఇతర నిర్మాణ పనులను కలెక్టర్‌ భారతి హోళికేరి, రోడ్లు, భవనాల శాఖ ఈఎన్‌సీ గణపతిరెడ్డితో కలిసి పరిశీ లించారు.

కలెక్టరేట్‌ నిర్మాణ పనులను త్వరగా పూర్తిచేయాలి
కలెక్టరేట్‌ భవనాన్ని పరిశీలిస్తున్న రాష్ట్ర రవాణా, రోడ్లు, భవనాల శాఖ ప్రిన్సిపల్‌

నస్పూర్‌,  అక్టోబరు  3 :   ఈ ఏడాది  డిసెంబరు చివరి నాటికి నస్పూర్‌లో నిర్మిస్తున్న కలెక్టరేట్‌ భవన సముదాయాన్ని ప్రారంభించేందుకు అవసరమైన  చర్యలను చేపట్టాలని రాష్ట్ర రవాణా, రోడ్లు, భవనాల శాఖ ప్రిన్సిపల్‌ సెక్రెటరీ కేఎస్‌ శ్రీనివాసరాజు సూచిం చారు. నస్పూర్‌లో నిర్మిస్తున్న కలెక్టరేట్‌ భవన సము దాయం సమావేశ మందిరం, కలెక్టర్‌ చాంబర్‌, ఇతర నిర్మాణ పనులను కలెక్టర్‌ భారతి హోళికేరి, రోడ్లు, భవనాల శాఖ ఈఎన్‌సీ గణపతిరెడ్డితో కలిసి పరిశీ లించారు. ప్రిన్సిపల్‌ సెక్రెటరీ శ్రీనివాసరాజు  నిర్మాణ పనులు చేపట్టిన కంపెనీ ప్రతినిధులతో మాట్లాడారు. పనులను మరింత వేగవంతం చేసి ఈ ఏడాది డిసెంబర్‌ చివరి నాటికి ప్రారంభమయ్యే విధంగా పనులు చేపట్టాలని సూచించారు. నిర్మాణాల్లో నాణ్యత పాటించాలని, అలసత్వం చేయరాదని ఆయన పేర్కొ న్నారు. సాంకేతిక సమస్యలు ఉన్నట్లయితే కలెక్టర్‌ దృష్టికి  తీసుకు రావాలన్నారు. తదితర అంశాలపై అధికారులు, కంపెనీ ప్రతినిధులతో మాట్లాడారు.  డిసెంబర్‌ చివరి నాటికి ప్రారంభించేలా  చర్యలు తీసుకోవాలన్నారు. అదనపు కలెక్టర్‌ మధుసూదన్‌ నాయక్‌, ఈఈ రాము, అధికారులు పాల్గొన్నారు.  

Updated Date - 2022-10-04T04:03:18+05:30 IST