కలెక్టరేట్‌ వద్ద మహిళ ఆత్మహత్యాయత్నం

ABN , First Publish Date - 2020-12-03T06:19:40+05:30 IST

అత్తింటి వారి వేధింపులు తట్టుకోలేక తన ఐదేళ్ల బాబుతో కలిసి న్యాయం చేయండంటూ ధర్నా చేస్తూనే ఆకస్మికంగా పురుగుమందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించిన వివాహితను కలెక్టరేట్‌ ఔట్‌ పోస్టు పోలీసులు జీజీహెచ్‌కు తరలించారు.

కలెక్టరేట్‌ వద్ద మహిళ ఆత్మహత్యాయత్నం
మహిళను ఆస్పత్రికి తీసుకెళుతున్న దృశ్యం

జీజీహెచ్‌కు తరలింపు

భానుగుడి(కాకినాడ) డిసెంబరు, 2: అత్తింటి వారి వేధింపులు తట్టుకోలేక తన ఐదేళ్ల బాబుతో కలిసి న్యాయం చేయండంటూ ధర్నా చేస్తూనే ఆకస్మికంగా పురుగుమందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించిన వివాహితను కలెక్టరేట్‌ ఔట్‌ పోస్టు పోలీసులు జీజీహెచ్‌కు తరలించారు. జగన్నాథపురం ప్రాంతంలో రాము దేవి లలితాదేవి, దివాకర్‌ ప్రసాద్‌ స్కూల్‌ దశ నుంచి ప్రేమించుకుని వివాహం చేసుకున్నారు. వీరికి ఐదేళ్ల బాబు ఉన్నాడు. అనారోగ్యానికి గురైన ప్రసాద్‌ మూ డేళ్ల కిందట మృతి చెందగా, ఆమె తన బిడ్డతో అత్తింటి వద్దే ఉంటోంది. అయితే తనకు అత్తింటి వారి వేధింపులు ఎక్కువకావడంతో చాలాసార్లు స్పందనలో ఫిర్యాదు చేసింది. వీరి ఆగడాలు తారస్థాయికి చేరుకోవడంతో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంఘాలతో కలిసి న్యాయం చేయండంటూ తన బిడ్డతో కలిసి బుధవారం మధ్యాహ్నం 12.30 ప్రాంతంలో ధర్నా చేపట్టింది. లలితాదేవికి ఎస్సీ, ఎస్టీ, బీసీ సంఘాలు మద్దతు తెలపగా, వారు మాట్లాడుతున్న సమయంలో లలితాదేవి తన పిల్లాడిని తీసుకుని పక్కకు వెళ్లి తనతోపాటు తెచ్చుకున్న పురుగుమందు తాగింది. ఇది గమనించిన ఔట్‌పోస్టు పోలీసులు తక్షణమే స్పందించి, పడిపోతున్న ఆమెను పట్టుకుని హుటాహుటీన జీజీహెచ్‌కు తరలించారు. 

జీజీహెచ్‌లో చికిత్స

కాకినాడ క్రైం(కాకినాడ), డిసెంబరు 2: కాకినాడ కలెక్టరేట్‌ వద్ద ఆత్మహత్యా యత్నానికి పాల్పడిన లలితాదేవి(36) జీజీహెచ్‌లో చికిత్స పొందుతోంది. బాధి తురాలి పరిస్థితి నిలకడగా ఉన్నట్టు జీజీహెచ్‌ అత్యవసర విభాగ వైద్యులు తెలి పారు. త్రీటౌన్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.



Updated Date - 2020-12-03T06:19:40+05:30 IST