CC cameras: కళాశాలల్లో సీసీ కెమెరాలు : యూజీసీ

ABN , First Publish Date - 2022-09-21T17:05:24+05:30 IST

ర్యాగింగ్‌ను అడ్డుకొనేలా కళాశాలల ప్రాంగణాల్లో సీసీ కెమెరాలు(CC cameras) తప్పనిసరిగా ఏర్పాటుచేయాలని యూజీసీ కార్యదర్శి రజనీష్‌ జైన్‌

CC cameras: కళాశాలల్లో సీసీ కెమెరాలు : యూజీసీ

ఐసిఎఫ్‌(చెన్నై), సెప్టెంబరు 20: ర్యాగింగ్‌ను అడ్డుకొనేలా కళాశాలల ప్రాంగణాల్లో సీసీ కెమెరాలు(CC cameras) తప్పనిసరిగా ఏర్పాటుచేయాలని యూజీసీ కార్యదర్శి రజనీష్‌ జైన్‌ తెలిపారు. ఈ మేరకు ఆయన విడుదల చేసిన ప్రకటనలో, ర్యాగింగ్‌ శిక్షార్హమైన నేరమని, ఉన్నత విద్యాసంస్థల్లో దీనిని అడ్డుకొనేందుకు వివిధ చర్యలు చేపట్టామన్నారు. విద్యాసంస్థల ప్రాంగణాల్లో సీసీ కెమెరాలు(CC cameras) ఏర్పాటుచేసి ర్యాగింగ్‌ను అడ్డుకొనేలా అవగాహన కార్య క్రమాలు చేపట్టాలని సూచించారు. హాస్టళ్లు, కాలేజ్‌ క్యాంప్‌సలు, టాయిలెట్‌, క్యాంటీన్లు వంటి వాటి వద్ద అధ్యాపకులు ఆకస్మికంగా తనిఖీ చేయాలన్నారు. ర్యాగింగ్‌కు పాల్పడే విద్యార్థులను గుర్తించి వెంటనే వారిపై చర్యలు చేపట్టాలని, అలాగే ర్యాగింగ్‌కు పాల్పడమని విద్యార్థులచే ప్రతిజ్ఞ చేయించాలని యూజీసీ ఉత్తర్వుల్లో పేర్కొంది.

Updated Date - 2022-09-21T17:05:24+05:30 IST