ఆ కంపెనీల మార్కెట్ క్యాప్... భారీ జంప్...

Sep 26 2021 @ 18:36PM

న్యూఢిల్లీ : టాప్ 10 కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ గతవారం రూ.1,56,317.17 కోట్లు ఎగిసిపడింది. అంతకుముందు వారం టాప్ 10లోని నాలుగు కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ గతవారం రూ. 65,464 కోట్లు ఎగిసింది. గతవారం దిగ్గజ కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 58,671.55 కోట్లు లాభపడి రూ. 15,74,052.03 కోట్లకు చేరుకుంది. గురువారం ఓ సమయంలో షేర్ ధర భారీగా పెరిగిన సందర్భంలో రిలయన్స్ మార్కెట్ క్యాప్ రూ. 16 లక్షల కోట్లకు చేరుకుంది. చివరకు ఈ మార్కుకు దిగువన ముగిసింది.


* ఇన్ఫోసిస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఈసారి పెరిగింది. గతవారం రూ. 30,605.08 కోట్లు పెరిగి రూ. 7,48,032.17 కోట్లకు చేరుకుంది.


* బజాజ్ ఫైనాన్స్ మార్కెట్ క్యాపిటలైజేషన్ గతవారం రూ. 22,173.04 కోట్లు పెరిగి రూ. 4,70,465.58 కోట్లకు చేరుకుంది.


* టీసీఎస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ గతవారం రూ. 15,110.63 కోట్లు పెరిగి రూ. 14,32,013.76 కోట్లకు చేరుకుంది.


* హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 10,142 కోట్లు పెరిగి, రూ. 8,86,739.86 కోట్లకు చేరుకుంది.


* భారతీ ఎయిర్‌టెల్ మార్కెట్ క్యాపిటలైజేషన్ గతవారం రూ. 6,068.69 కోట్లు ఎగిసి,  రూ. 4,05,970.66 కోట్లకు చేరుకుంది.


* హిందుస్తాన్ యూనీలీవర్ లిమిటెడ్ మార్కెట్ క్యాపిటలైజేషన్ గతవారం రూ. 4,863.65 కోట్లు పెరిగి, రూ. 6,44,199.18 కోట్లకు చేరుకుంది.


* కొటక్ మహీంద్రా బ్యాంకు మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 4,254.75 కోట్లు పెరిగి, రూ. 4,01,978.75 కోట్లుగా నమోదైంది.


* హెచ్‌డీఎఫ్‌సీ మార్కెట్ క్యాపిటలైజేషన్ గతవారం రూ. 2,523.56 కోట్లు పెరిగి, రూ. 5,13,073.85 కోట్లకు పడిపోయింది.


* ఐసీఐసీఐ బ్యాంకు మార్కెట్ క్యాపిటలైజేషన్ గతవారం రూ. 1,904.22 కోట్లు పెరిగి, రూ. 5,01,080.90 కోట్లకు చేరుకుంది.


టాప్ 10 కంపెనీలివే... 

గతవారం మార్కెట్లు ఐదు సెషన్లు పనిశాయి. టాప్ టెన్ కంపెనీల విషయానికొస్తే రిలయన్స్ ఇండస్ట్రీస్, టీసీఎస్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, ఇన్ఫోసిస్, హిందూస్తాన్ యూనీలీవర్, ఐసీఐసీఐ  బ్యాంకు, బజాజ్ ఫైనాన్స్, భారతీ ఎయిర్‌టెల్, కొటక్ మహీంద్రా బ్యాంకు ఉన్నాయి.

ఇవి కూడా చదవండి :

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.