కాలనీ సమస్యలు పరిష్కరించాలి

ABN , First Publish Date - 2022-08-07T05:30:00+05:30 IST

కాలనీ సమస్యలు పరిష్కరించాలి

కాలనీ సమస్యలు పరిష్కరించాలి
మంత్రి మల్లారెడ్డికి వినతిపత్రం అందజేస్తున్న మేడ్చల్‌ పట్టణ అర్చన కాలనీ వాసులు

  • మంత్రి మల్లారెడ్డికి మేడ్చల్‌ పరిధి అర్చన కాలనీ వాసుల వినతి

మేడ్చల్‌, ఆగస్టు 7: మేడ్చల్‌ పట్టణ 4వ వార్డులోని అర్చన కాలనీలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని కాలనీవాసులు కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఆదివారం నగరంలోని మంత్రి నివాసానికి కాలనీవాసులు చేరుకొని సమస్యలు వెల్లబోసుకున్నారు. కాలనీలో సీసీ రోడ్లు, అండర్‌ గ్రౌండ్‌ డ్రైనీజీ లేదని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. కాలనీలో పార్క్‌ స్థలాన్ని కబ్జా చేశారని వారు పేర్కొన్నారు. కాలనీలో మౌలిక వసతులు లేక ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. మంత్రిని కలిసిన వారిలో కాలనీ అసోసియోషన్‌ అధ్యక్షుడు జనార్దన్‌రెడ్డి, రాములు, గిరిబాబు, రాంరెడ్డి, అశోక్‌, హన్మంత్‌రెడ్డి, గంగయ్య, కమలాకర్‌రెడ్డి ఉన్నారు.


  • ‘పంచాయతీలకు నిధులు కేటాయించాలి’

ఘట్‌కేసర్‌ రూరల్‌: గ్రామ పంచాయతీలకు నిధులు కేటాయించాలని మండల సర్పంచ్‌లు మంత్రి మల్లారెడ్డిని కోరారు. ఆదివారం సర్పంచ్‌ల సంఘం అఽధ్యక్షుడు కొర్రెముల సర్పంచ్‌ ఓరుగంటి వెంకటేష్‌గౌడ్‌ ఆఽధ్వర్యంలో మంత్రి నివాసానికి వెళ్లి కలిశారు. పంచాయతీల్లో నిధుల్లేక గ్రామా ల్లో పనులు చేపట్టలేకపోతున్నామని మంత్రికి వివరించారు. హెచ్‌ఎండీఎ నిధులు ఇప్పించాలని కోరారు. గ్రామాలకు రావాల్సిన హెచ్‌ఎండీఏ నిధులు వచ్చేలా కృషిచేస్తానని మంత్రి హామీ ఇచ్చినట్లు సర్పంచ్‌లు తెలిపారు. సర్పంచ్‌లు కొంతం వెంకట్‌రెడ్డి, సురేష్‌, జలజాసత్యనారాయ ణరెడ్డి, రమాదేవి, నాయకులు చందుపట్ల ధర్మారెడ్డి, దుర్గరాజుగౌడ్‌, నందకుమార్‌, నాగులపల్లి రమేష్‌, సత్యనారాయణరెడ్డి, రాములుగౌడ్‌, శ్రీనివాస్‌, వేణు పాల్గొన్నారు. 

Updated Date - 2022-08-07T05:30:00+05:30 IST