కుక్కకు స్వాగతం పలికేందుకు కాలనీ మొత్తం కదిలివచ్చింది.. కారణం తెలుసుకుని అంతా ఆశ్చర్యపోతున్నారు..

ABN , First Publish Date - 2022-02-27T02:44:37+05:30 IST

ముంబైలో ఓ కాలనీవాసులంతా కలిసి కుక్కపై ఇలాంటి ప్రేమే చూపించారు. దానికి స్వాగతం పలికేందుకు కాలనీ... కాలనీ మొత్తం... తరలివచ్చింది! విషయం తెలుసుకుని అంతా ఆశ్చర్యపోయారు...

కుక్కకు స్వాగతం పలికేందుకు కాలనీ మొత్తం కదిలివచ్చింది.. కారణం తెలుసుకుని అంతా ఆశ్చర్యపోతున్నారు..

మనుషుల కంటే కుక్కలే నయం.. అని అప్పుడప్పుడూ పెద్దలు అంటుంటారు. ఒక్క పూట భోజనం పెట్టినా జీవితాంతం విశ్వాసం చూపిస్తాయి కాబట్టే.. వాటిని విశ్వాసానికి మారుపేరుగా పిలుస్తుంటాం. అందుకే ధనవంతులు ప్రస్తుతం లక్షలు ఖర్చు చేసి మరీ వివిధ జాతులకు చెందిన కుక్కలను కొంటూ ఉంటారు. కొందరైతే వాటిని సొంత పిల్లల మాదిరే చూసుకుంటూ ఉంటారు. వాటికి కాస్త ఇబ్బంది కలిగినా తట్టుకోలేరు. ముంబైలో ఓ కాలనీవాసులంతా కలిసి కుక్కపై ఇలాంటి ప్రేమే చూపించారు. దానికి స్వాగతం పలికేందుకు కాలనీ... కాలనీ మొత్తం... తరలివచ్చింది! విషయం తెలుసుకుని అంతా ఆశ్చర్యపోయారు.


ముంబైలోని ప్రభాదేవి ప్రాంతంలో ఓ సొసైటీ వారు ‘విస్కీ’ అనే వీధి కుక్కను పెంచుకునేవారు. కాలనీవాసులంతా దాన్ని ఎంతో ప్రేమతో చూసుకునేవారు. రోజూ ఒక్కొక్కరు చొప్పున దాని బాగోగులు చూసుకునేవారు. ఇదిలావుండగా ఇటీవల హఠాత్తుగా ఆ కుక్క కనిపించకుండా పోయింది. ఒక్కసారిగా అది దూరమవడాన్ని కాలనీవాసులు జీర్ణించుకోలేకపోయారు.  ఎంత వెతికినా ఎక్కడా కనిపించలేదు. తీవ్ర నిరాశలో ఉన్న వారికి ఓ రోజు స్థానికంగా ఉన్న ఓ మైదానంలో కనిపించింది. వెంటనే దాన్ని కారులో ఎక్కించుకుని మరీ కాలనీకి తీసుకొచ్చారు. విషయం తెలుసుకుని కాలనీవాసులంతా దానికి స్వాగతం పలికేందుకు వచేశారు! మహిళలు హారతి పట్టి మరీ స్వాగతించారు. ఈ ఘటనను మొత్తం కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. కుక్క పట్ల ప్రేమ కనబరచిన కాలనీవాసులను నెటిజన్లు పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.

ఒంటరి గదిలో ప్రియురాలికి దోశ తినిపిస్తోన్న ప్రియుడు.. అంతలో ఉన్నట్టుండి ఊహించని ఘటన.. చివరికి ఏం జరిగిందంటే..



Updated Date - 2022-02-27T02:44:37+05:30 IST