కలర్‌ఫుల్‌ కఫ్తాన్‌

Published: Wed, 17 Aug 2022 01:41:31 ISTfb-iconwhatsapp-icontwitter-icon
కలర్‌ఫుల్‌ కఫ్తాన్‌

కఫ్తాన్‌ అనగానే మనకు ఆ తరహా నైటీలే కళ్ల ముందు మెదులుతాయి. 

కానీ బాందిని ప్రింట్‌తో కూడిన కఫ్తాన్‌ స్టైల్‌ టాప్స్‌, కుర్తీలు తాజా ఫ్యాషన్‌ ట్రెండ్‌గా మారాయి. అలాంటి కొన్ని కఫ్తాన్‌ స్టైల్స్‌ మీకోసం!


బాందిని ప్రింట్‌: చీరలకే పరిమితమైన బాందిని ప్రింట్‌ ఇప్పుడు టాప్స్‌కూ, కుర్తీలకూ పాకింది. చుక్కలు, లతలతో కూడిన ఈ డిజైన్‌తో కఫ్తాన్లకు సంప్రదాయ లుక్‌ చేకూరడంతో పాటు, చక్కని ఆకర్షణ కూడా అబ్బుతుంది.


నచ్చిన బాటమ్‌తో: కఫ్తాన్‌ టాప్‌తో ఎలాంటి బాటమ్‌ అయినా ధరించవచ్చు. పెన్సిల్‌ ప్యాంట్‌, పలాజో, పాటియాలా... ఇలా నచ్చిన బాటమ్‌ ఎంచుకోవచ్చు. అయితే అది కాంట్రాస్ట్‌ కలర్‌లో ఉండేలా చూసుకోవాలి.


యాక్సెసరీస్‌: హీల్స్‌, ఫ్లాట్స్‌ కఫ్తాన్లకు సూటవుతాయి. బాందినీ ప్రింట్‌తో గ్రాండ్‌గా కనిపించే ఈ దుస్తులకు తేలికపాటి జ్యువెలరీ, యాక్సెసరీలు నప్పుతాయి.


ఆకర్షణీయమైన రంగుల్లో: బాందిని కఫ్తాన్లు సాదాసీదా రంగుల్లో కంటే, ఆకట్టుకునే రంగుల్లోనే చూడముచ్చటగా కనిపిస్తాయి. కాబట్టి ముదురు ఎరుపు, ఆకుపచ్చ, పసుపు, గులాబీ... ఇలా కలర్‌ఫుల్‌ కఫ్తాన్లను ఎంచుకోవాలి.

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.