రంగురాళ్లు, గులకరాళ్లయిన జగన్‌ నవరత్నాలు

ABN , First Publish Date - 2021-10-24T05:05:37+05:30 IST

రెండున్నరేళ్ల జగన్‌ పాలనలో నకి లీరత్నాలు, కొన్ని రంగురాళ్లుగా, మరికొన్ని గులకరాళ్లుగా నవ రత్నాలు తయారయ్యాయని పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ తు లసిరెడ్డి ఎద్దేవా చేశారు.

రంగురాళ్లు, గులకరాళ్లయిన జగన్‌ నవరత్నాలు
మాట్లాడున్న తులసిరెడ్డి

పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ తులసిరెడ్డి

వేంపల్లె, అక్టోబరు 23: రెండున్నరేళ్ల జగన్‌ పాలనలో నకి లీరత్నాలు, కొన్ని రంగురాళ్లుగా, మరికొన్ని గులకరాళ్లుగా నవ రత్నాలు తయారయ్యాయని పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ తు లసిరెడ్డి ఎద్దేవా చేశారు. వేంపల్లెలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ జగన్‌ నవరత్నాల్లో మొదటిదైన రైతు భరోసా పథకం రైతు నిరాశాపథకమైందన్నారు. రైతు కుటుంబానికి ఏడాదికి రూ.12500 ఆర్థికసహాయం చేస్తామని ప్రకటించి అందులో రూ.5వేలు కోత పెట్టిందన్నారు.

సున్నావడ్డీ పథకానికి సున్నంపెట్టి, పావలావడ్డీ పథకానికి పాడెకట్టి, బిందు తుంపర సేద్యాన్ని అటకెక్కించిందన్నారు. జీఓ 77 ద్వారా ఉన్న త చదువులు చదివే పేద విద్యార్థులకు ఫీజురీయింబర్స్‌మెంట్‌ రద్దుచేయడంతో రెండో రత్నం ఫీజ్‌ రీయింబర్స్‌ మెంట్‌ పథకం రంగురాయిగా మారిందన్నారు. వైద్య, ఆరోగ్య రం గానికి నిధుల కేటాయింపులో కోత కోసి మూడో రత్నమైన ఆరోగ్యశ్రీని అనారోగ్యశ్రీగా మా ర్చిందన్నారు.

సాగునీటి రంగానికి బడ్జెట్‌ కేటాయింపులు తగ్గించడమే కాకుండా కేటాయిం చిన నిధుల్లో కూడా కోతపెట్టిందన్నారు. గత ఆర్థిక సంవత్సరంలో రూ.11806కోట్లు కేటా యించి కేవలం రూ.5238కోట్లు ఖర్చుపెట్టిందన్నారు. ఐదోరత్నమైన మద్యపాన నిషేధ పథ కం మద్యపాన నిషాపథకంగా, జగనన్న తాళిబొట్టు తాకట్టుపెట్టే పథకంగా తయారైంద న్నారు. రెండున్నరేళ్లలో పేదలకు ఒక్క ఇళ్లు కట్టించి ఇచ్చిన పాపానపోలేదన్నారు. 2.80లక్ష ల మంది అవ్వాతాతలకు పింఛన్లను కోతపెట్టడమే కాకుండా నెలకు రూ.3వేలు ఇస్తానని చెప్పి రూ.2250 మాత్రమే ఇస్తున్నారన్నారు. ఈ వివరాలను పరిశీలిస్తే ప్రచారానికి మాత్ర మే నవరత్నాలు తప్ప ఆచరణలో నకిలీరాళ్లుగా, రంగురాళ్లుగా, గులకరాళ్లుగా తయారైనట్లు స్పష్టమవుతోంద న్నారు. బద్వేలు ఉప ఎన్నికలో వైసీపీని ఓడించడమే పరిష్కారమన్నారు.

Updated Date - 2021-10-24T05:05:37+05:30 IST