Jalebi: ఈ విదేశీ వనిత ఎంతమాట అనేసింది.. హర్ట్‌ అయిన భారతీయులు.. నెట్టింట్లో వీడియో వైరల్

ABN , First Publish Date - 2022-10-02T23:08:15+05:30 IST

ఓ విదేశీ మహిళలపై ప్రస్తుతం మన వాళ్లు గుర్రుగా ఉన్నారు. తొలిసారి జిలేబీ రుచి చూశాక ఆమె అన్నమాటలకు.. ‘జిలేబీ’ ఫ్యాన్స్ నొచ్చుకున్నారు.

Jalebi: ఈ విదేశీ వనిత ఎంతమాట అనేసింది.. హర్ట్‌ అయిన భారతీయులు.. నెట్టింట్లో వీడియో వైరల్

ఎన్నారై డెస్క్: భారతీయ వంటకాలంటే విదేశీయులు కూడా ఇష్టపడతారు. అక్కడి భారతీయ రెస్టరెంట్లకు వెళ్లి లొట్టలేసుకుంటూ తింటారు. ఇక తొలిసారి మన ఫుడ్‌ను టేస్ట్ చేసి ఇంప్రెస్ అయిపోయే విదేశీయుల వీడియోలు తరచూ నెట్టింట్లో వైరల్(Viral) అవుతూనే ఉంటాయి. అయితే.. అందరికీ అన్ని రుచులూ నచ్చాలన్న రూలేమీ లేదు కదా.. ఒక్కొక్కరిదీ ఒక్కో టేస్ట్..! అందుకే కొందరు మన వంటకాలపై అంతగా ఇష్టత కనబర్చరు. ఇప్పుడిదంతా ఎందుకంటే.. ఓ విదేశీ మహిళలపై ప్రస్తుతం మనోళ్లు గుర్రుగా ఉన్నారు. తొలిసారి జిలేబీ రుచి చూశాక ఆమె అన్నమాటలకు.. ‘జిలేబీ’ ఫ్యాన్స్ నొచ్చుకున్నారు. అసలేం జరిగిందంటే.. 


కొలీన్ గౌడ(Colleen gowda) అనే కొలంబియా(Columbia) వనిత ఓ వీడియోను ఇటీవలే ఇన్‌స్టాలో షేర్ చేశారు. ఆమె తొలిసారిగా జిలేబీని రుచి చూస్తుండగా తీసిన వీడియో అది..! జిలేబీని రుచి చూశాక ఆమె..అందులోని తియ్యదనానికి కొద్దిగా ఇబ్బంది పడ్డారు. ‘‘నో.. మరీ ఇంత తియ్యగానా.. చెక్కర ఎక్కువైంది..’’ అంటూ తనకు అనిపించింది ఠక్కున బయటకు చెప్పేశారు. ‘‘ఏంటి ఇంత జిగటగా ఉంది..’’ అని కూడా కామెంట్ చేశారు. ప్రస్తుతం కొలీన్ వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. అనేక మంది నెటిజన్లు ఆమె పరిస్థితిని అర్థం చేసుకున్నప్పటికీ.. జిలేబీ అభిమానుల మనుసులను మాత్రం ఆమె గాయపరిచింది. 


‘మా వంటకం బాలేదంటావా’ అంటూ కొందరు నెటిజన్లు ఘాటు కామెంట్లు చేశారు. ‘జిలేబీ(Jalebi) నచ్చని వాళ్లు ఎవరైనా ఉంటారా’ అని మరి కొందరు కోపగించుకున్నారు. ‘‘ఏంటీ.. జిలేబీనే కాదన్నావా..’’ అంటూ మరికొందరు ఆశ్చర్యపోయారు. అయితే.. కొంత మంది మాత్రం సానుకూలంగానే స్పందించారు. ‘‘అంతగా నొచ్చుకోకండి బ్రదర్స్.. జిలేబీ తినేందుకు ముందుకొచ్చినందుకైనా మనం ఆమెను ప్రోత్సహించాలి కదా..’’ అంటూ సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. అయితే.. వీడియో మాత్రం విపరీతంగా వైరల్ అవుతోంది. ఇప్పటికే 3.5 మిలియన్ల పైచిలుకు వ్యూస్ వచ్చాయంటే..వీడియో ఏ రేంజ్‌లో ట్రెండ్ అవుతోందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ఇంతలా వైరల్ అవుతున్న ఆ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.





Updated Date - 2022-10-02T23:08:15+05:30 IST