IPL టీవీ, డిజిటల్ హక్కుల కోసం రూ.43 వేల కోట్లకుపైగా సంయుక్త బిడ్?.. మ్యాచ్‌కు రూ.100 కోట్లు పైమాటే..

ABN , First Publish Date - 2022-06-13T02:27:15+05:30 IST

ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL) 2023 - 2027 సీజన్ల మీడియా హక్కులకు సంబంధించిన ఈ-ఆక్షన్ ప్రక్రియ ఆదివారం మొదలైంది.

IPL టీవీ, డిజిటల్ హక్కుల కోసం రూ.43 వేల కోట్లకుపైగా సంయుక్త బిడ్?.. మ్యాచ్‌కు రూ.100 కోట్లు పైమాటే..

ముంబై : ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL) 2023 - 2027 సీజన్ల మీడియా హక్కులకు సంబంధించిన ఈ-ఆక్షన్ ప్రక్రియ ఆదివారం మొదలైంది. ఐదేళ్లకు సంబంధించిన టీవీ, డిజిటల్ హక్కుల కోసం రూ.43,050 కోట్లకుపైగా ఉమ్మడి బిడ్ ఒకటి దాఖలైందని బీసీసీఐ వర్గాల సమాచారం. ఐదేళ్లలో ప్రతి సీజన్‌లో 74 మ్యాచ్‌ల నిర్వహణకు చేపడుతున్న ఈ-వేలంలో 4 స్పెషల్ ప్యాకేజీలు ఉన్నాయి. వేలం ప్రక్రియను 4 ప్యాకేజీలు(ఏ, బీ, సీ, డీ)గా విడగొట్టారు. ప్యాకేజీ-ఏ కింద భారత ఉపఖండంలో ఎక్స్‌క్లూజివ్ టీవీ ప్రసార హక్కులు దక్కుతాయి. ప్యాకేజీ-బీ కింద ఇదే ప్రాంతంలో డిజిటల్ హక్కులు మాత్రమే అందుతాయి. ప్యాకేజీ-సీ కేవలం ఎంపిక చేసిన మ్యాచ్‌లకు మాత్రమే హక్కులు వర్తిస్తాయి. అది కూడా ఏ సీజన్‌కు సంబంధించిన మ్యాచ్‌లు ఆ సీజన్‌ వరకే ఉంటుంది. ఇక ప్యాకేజీ-డీలో భాగంగా అన్నీ మ్యాచ్‌లకు సంబంధించిన టీవీ, డిజిటల్ ఓవర్సీస్ హక్కులు దక్కుతాయని సమాచారం. కాగా బీసీసీఐ వర్గాల సమాచారం ప్రకారం.. ఒక్క మ్యాచ్‌కు సంబంధించిన టీవీ, డిజిటల్ హక్కులు రూ.100 కోట్లకు పైమాటగానే ఉంది. కాగా చివరి రెండు సీజన్లలో 94 మ్యాచ్‌లకు పెంపునకు వీలుగా నిబంధనను పొందుపరిచారని మీడియా రిపోర్టులు పేర్కొంటున్నాయి.


కాగా ఐపీఎల్ మీడియా హక్కుల రేస్ నుంచి అమెజాన్ ఇటివలే తప్పుకుంది. అంతక్రితం 2017-2022 ఐపీఎల్ మీడియా హక్కులను స్టార్ ఇండియా రూ.16,347.50 కోట్లకు హక్కులు చేజిక్కించుకుంది. ఈ ఒప్పందం ప్రకారం ఒక్కో మ్యాచ్ విలువ సుమారు రూ.55 కోట్లుగా ఉన్న విషయం తెలిసిందే.  

Updated Date - 2022-06-13T02:27:15+05:30 IST