మత్తడి దూకుతున్న లక్నవరం చెరువు..

ABN , First Publish Date - 2022-07-14T13:43:24+05:30 IST

ఉమ్మడి వరంగల్ జిల్లా(Warangal District) వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలకు వాగులు, చెరువులు మత్తడి దుంకుతున్నాయి. ఇక.. జిల్లాలోని ప్రధాన చెరువులు నిండుకుండలా మారాయి

మత్తడి దూకుతున్న లక్నవరం చెరువు..

వరంగల్: ఉమ్మడి వరంగల్ జిల్లా(Warangal District) వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలకు వాగులు, చెరువులు మత్తడి దుంకుతున్నాయి. ఇక.. జిల్లాలోని ప్రధాన చెరువులు  నిండుకుండలా మారాయి. పూర్తిగా నిండిన లక్నవరం(laknavaram) చెరువు మత్తడి దూకుతుంది. రామప్ప(Ramappa) సరస్సులో 30 అడుగులకు నీటిమట్టం చేరింది. పాకాల సరస్సులో నీటిమట్టం 29 అడుగులకు చేరింది. గణపసముద్రం 30 అడుగుల మేర నిండిన చెరువు మత్తడి పోస్తుంది.

Updated Date - 2022-07-14T13:43:24+05:30 IST