ఇలా వచ్చి అలా ఆగిపోయే!

ABN , First Publish Date - 2022-09-30T05:37:19+05:30 IST

జిల్లాలోనే వెనుకబడిన పుల్లలచెరువు మండలానికి నూతనంగా కేటాయించిన బస్సు వచ్చిన తొలిరోజే మరమ్మతులకు గురైంది. ఎయిర్‌బాక్స్‌ గుంతల్లో కింద తగిలి పుల్లలచెరువు బస్టాండ్‌లో నిలిచిపోయింది. ఈ ఘటన గురువారం మధ్యాహ్నం జరిగింది.

ఇలా వచ్చి అలా ఆగిపోయే!
పుల్లలచెరువు బస్టాండ్‌లో నిలిచిపోయిన ఆర్టీసీ బస్సు

గుంటూరు నుంచి పుల్లలచెరువుకు ఆర్టీసీ బస్సు

కవలకుంట్ల వద్ద గుంతల్లో పడి విరిగిన ఎయిర్‌బాక్స్‌

తొలిరోజే బస్టాండ్‌లో నిలిచిపోయిన పరిస్థితి

పుల్లలచెరువు, సెప్టెంబరు 29: జిల్లాలోనే వెనుకబడిన పుల్లలచెరువు మండలానికి నూతనంగా కేటాయించిన బస్సు వచ్చిన తొలిరోజే మరమ్మతులకు గురైంది. ఎయిర్‌బాక్స్‌ గుంతల్లో కింద తగిలి పుల్లలచెరువు బస్టాండ్‌లో నిలిచిపోయింది. ఈ ఘటన గురువారం మధ్యాహ్నం జరిగింది. పుల్లలచెరువు మండలానికి గుంటూరు జిల్లాకు సరిహద్దు ఉండటంతో వైద్యశాలతో పాటు ప్రతి పనికి ప్రజలు గుంటూరుకు నిత్యం వెళ్తుంటారు. దీంతో గుంటూరు డిపో-2 నుంచి గురువారం నూతన సర్వీ్‌సను నర్సరావుపేట, వినుకొండ, త్రిపురాంతకం, వైపాలెం మీదుగా పుల్లలచెరువుకు కేటాయించారు. తొలిరోజు కావడంతో డ్రైవరుకు అవగాహన లేకపోవడంతో పుల్లలచెరువు-కవలకుంట్ల మధ్య ఉన్న ఆర్‌అండ్‌బీ రోడ్డు గుంతల్లో బస్సు దిగింది. దీంతో బస్సు కింద వైపు ఎయిర్‌బాక్స్‌ కట్టర్లు విరిగిపోయాయి. గమనించిన డ్రైవరు చాకచక్యంగా వ్యవహరించి పుల్లలచెరువు బస్టాండ్‌కు చేర్చి మరమ్మతుల కోసం డిపోకు సమాచారం ఇచ్చారు. అయితే తొలిరోజు సర్వీ్‌సకు వచ్చి ఆగిపోవడంతో మండల ప్రజలు నిరాశచెందారు.


Updated Date - 2022-09-30T05:37:19+05:30 IST