అర్జీని పరిశీలిస్తున్న ఎస్పీ ప్రవీణ్‌కుమార్ నిర్భయంగా రండి.. పోలీసు సేవలు పొందండి ఫ ఎస్పీ ప్రవీణ్‌కుమార్ పిలుపు నిర్మల్ కల్చరల్, జూన్ 27 : ప్రజలు నిర్భయంగా పోలీసుస్టేషన్లకు వచ్చి సేవలు పొందాలని, సమస్యలు పరిష్కరించుకోవాలని ఎస్పీ ప్రవీణ్ కుమార్ పిలుపునిచ్చారు. సోమవారం ఆయన జిల్లా పోలీస్ కార్యాల యంలో ప్రజా ఫిర్యాదుల విభాగంలో భాగంగా ప్రజల నుండి విజ్ఞప్తులు తీసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... ప్రజా సమస్యలు చట్ట ప్రకారం పరిష్కరించుకోవాలనే భావంతో ప్రజల నుండి ప్రతి సోమవారం ఫిర్యాదులు స్వీకరిస్తున్నామని అన్నారు. శాంతిభద్రతలు పరిరక్షించే లక్ష్యం గా పోలీస్‌శాఖ పని చేస్తోందన్నారు. పోలీసులు ప్రజలతో స్నేహభావంగా ఉంటూ వారి సమస్యలు సావధానంగా విని పరిష్కరించాలని ఆదేశించా రు. ప్రజలు కూడా సంఘ వ్యతిరేక శక్తుల, అనుమానితుల సమాచారాన్ని పోలీసులకు తెలియజేసి సహకరించాలన్నారు. అందుకోసం ఏర్పాటు చేసిన వాట్సాప్నెంబర్ 8333986939 ఉపయోగించుకోవాలని సూచిం చారు. పలు ప్రాంతాల నుండి వచ్చి ప్రజలు ఎస్పీకి అర్జీలు సమర్పిం చారు. సంబంధిత స్టేషన్ అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కార మయ్యేలా సహకరించాలన్నారు.
ఎస్పీ ప్రవీణ్‌కుమార్ పిలుపు
నిర్మల్ కల్చరల్, జూన్ 27 : ప్రజలు నిర్భయంగా పోలీసుస్టేషన్లకు వచ్చి సేవలు పొందాలని, సమస్యలు పరిష్కరించుకోవాలని ఎస్పీ ప్రవీణ్ కుమార్ పిలుపునిచ్చారు. సోమవారం ఆయన జిల్లా పోలీస్ కార్యాల యంలో ప్రజా ఫిర్యాదుల విభాగంలో భాగంగా ప్రజల నుండి విజ్ఞప్తులు తీసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... ప్రజా సమస్యలు చట్ట ప్రకారం పరిష్కరించుకోవాలనే భావంతో ప్రజల నుండి ప్రతి సోమవారం ఫిర్యాదులు స్వీకరిస్తున్నామని అన్నారు. శాంతిభద్రతలు పరిరక్షించే లక్ష్యం గా పోలీస్‌శాఖ పని చేస్తోందన్నారు. పోలీసులు ప్రజలతో స్నేహభావంగా ఉంటూ వారి సమస్యలు సావధానంగా విని పరిష్కరించాలని ఆదేశించా రు. ప్రజలు కూడా సంఘ వ్యతిరేక శక్తుల, అనుమానితుల సమాచారాన్ని పోలీసులకు తెలియజేసి సహకరించాలన్నారు. అందుకోసం ఏర్పాటు చేసిన వాట్సాప్నెంబర్ 8333986939 ఉపయోగించుకోవాలని సూచిం చారు. పలు ప్రాంతాల నుండి వచ్చి ప్రజలు ఎస్పీకి అర్జీలు సమర్పిం చారు. సంబంధిత స్టేషన్ అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కార మయ్యేలా సహకరించాలన్నారు.