మూడెకరాలకో వా(కో)త!

ABN , First Publish Date - 2022-05-21T07:03:28+05:30 IST

జిల్లాలో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. దీనిలో భాగం గా మూడెకరాలకో పైపులైను పేరిట చేస్తున్న పనుల వల్ల మండలంలోని ఆయా గ్రామాల పరిధిలోని పంటపొలాల్లో గల అంతర్గత పైపులైన్లు కోతకు గురవు తున్నాయి. దీంతో స్థానిక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

మూడెకరాలకో వా(కో)త!
నార్సింగ్‌ పల్లి గ్రామంలో దిలీప్‌ పొలంలో కోతకు గురైన అంతర్గత పైపులైను

జిల్లాలో కొనసాగుతున్న కాళేశ్వరం ప్రాజెక్టు పనులు

మూడెకరాలకో పైపులైను పేరిట పంటపొలాల్లో తవ్వకాలు

 అంతర్గతంగా కోతకు గురవుతున్న పైపులైన్లు 

తమకేమీ సంబంధం లేదంటున్న కాంట్రాక్టర్‌ 

చేతులెత్తేస్తున్న అధికారులు 

లబోదిబోమంటున్న బాధిత రైతులు

సిరికొండ, మే 20: జిల్లాలో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. దీనిలో భాగం గా మూడెకరాలకో పైపులైను పేరిట చేస్తున్న పనుల వల్ల మండలంలోని ఆయా గ్రామాల పరిధిలోని పంటపొలాల్లో గల అంతర్గత పైపులైన్లు కోతకు గురవు తున్నాయి. దీంతో స్థానిక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బోరుబావి నుంచి మడి మడికి నీళ్లం దించడానికి వేసుకున్న అంతర్గత పైపులైన్లు కోతకు గురవుతున్నా.. కాంట్రాక్టర్‌ మాకేమీ సంబంధం లేద న్నట్లు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల తాము ఆర్థి కంగా నష్టపోతున్నామని  రైతులు ఆవేదన వ్యక్తం చే స్తున్నారు. కోతకు గురైన పైపులు బాగు చేసుకోవడా నికి ఇద్దరు కూలీలతో పాటు పైపులను కలపడానికి (జాయింట్‌ చేయడానికి) కప్లింగ్‌లు, అతుకపెట్టడానికి సులీషన్‌, తదితర వస్తువులను  కొనుగోలు చేయాల్సి న అవసరం ఉందని వారు చెబుతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు 21(ఏ) ప్యాకేజీ పనుల్లో భాగంగా మెంట్రాజ్‌ పల్లి ఇన్‌టెక్‌వెల్‌ నుంచి వచ్చే గోదావరి జలాలను భీం గల్‌ మండలం నుంచి సిరికొండ మండలంలోని నార్సింగ్‌పల్లి, చిన్నవాల్గోట్‌, రావుట్ల, న్యావనంది, తది తర గ్రామాల రైతాంగానికి అందించడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఇందులో భాగంగానే మూడెకరాల కు ఒక పైపులైను చొప్పున వేయడానికి పనులను చకాచకా చేస్తున్నారు. ఈ గ్రామాల పరిధిలో గల రైతాంగం అంతర్గతంగా పొలాల్లో వేసుకునన్న పైపులు కోతకు గురవుతుండడం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందు లు పుడుతున్నారు. పైపులైను కోసం కాలువలు తవ్వే ముందు రైతులు సంబంధిత కాంట్రాక్టర్‌ కనీసం స మాచారం కూడా ఇవ్వక పోవడం విడ్డూరం. ముందు గా సమాచారం ఇస్తే పైపులైను కోతకు గురి కాకుం డా చూసుకునే వారమని రైతన్నలు అంటున్నారు. ఒ క్కొక్క రైతు పొలంలో రెండు, మూడు చోట్ల పైపు లైన్లు కోతకు గురవుతున్నాయని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కోతకు గురైన పైపులను బాగు చేసుకోవాలంటే కనీసం రూ.నాలు, గైదు వేలు ఖర్చు అవుతోందని రైతులు అంటున్నారు. తమకు సాగు నీటిని అందించడానికి ప్రభుత్వం మంచి పని  చేస్తుం టే ఒకపక్క ఆనందం ఉన్నా.. మరోపక్క పగిలి పోయిన పైపులను ఎవరు బాగు చేయిస్తారని రైతు లు అధికారులను ప్రశ్నిస్తున్నారు. పగిలిపోయిన పైపు లను బాగుచేయించాలని సంబందిత కాంట్రాక్టర్‌ను అడిగితే తమకేమీ సంబందం లేదని తెగేసి చెప్పడం దారుణమన్నారు. కాంట్రాక్టర్‌ ఏమాత్రం సానుకూలం గా మాట్లాడకపోవడం వల్ల రైతులు ఆందోళన చెందు తున్నారు. మిషన్‌భగీరథ పనులు జరిగినప్పుడు పైపు లు పగిలిపోతే సంబంధిత కాంట్రాక్టరే బాగు చేయిం చారని, ప్రస్తుతం కూడా కాంట్రాక్టరే పగిలిన పైపుల ను బాగు చేయించే విధంగా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. లేదంటే ఆందోళనలు చేయక తప్పదని రైతులు స్పష్టం చేశారు.

కాంట్రాక్టరే పగిలిన పైపులు బాగు చేయించాలి

: రొండ్ల గంగారెడ్డి, బాధిత రైతు, చిన్నవాల్గోట్‌

పంటపొలాల్లో పగిలిపోయిన పైపులను సంబంధిత కాంట్రాక్టరే బాగు చేయించాలి. పైపులు పగిలిపోవడం వల్ల ఒక్కొక్క రైతు రూ.నాలు, గైదు వేల చొప్పున నష్టపోవాల్సి వస్తుంది. దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు. పగిలిన పైపులను జాయింట్‌ చేయడానికి ఇద్దరు కూలీలు, సులీషను, జాయింట్‌ చేయడానికి కప్లింగ్‌లు కొనుక్కోవాల్సి వస్తుంది.

బాధిత రైతులకు శాఖ తరపున పైపులు మాత్రమే ఇస్తాం

: సునీల్‌, నీటిపారుదల శాఖ ఏఈ, సిరికొండ

మూడెకరాలకు ఒక పైపు లైను వేస్తున్న సమయంలో రైతుల పైపులు కోతకు గురయితే మాకు సంబంధం లేదు. మండలంలోని చిన్నావాల్గోట్‌, నార్సింగ్‌పల్లి, రావుట్ల, నావ్యనంది, తదితర గ్రామాల్లో పైపుల వేయడానికి కాలువలు తవువ్వతుండగా రైతులు వేసుకున్న అంతర్గత పైపులు పగిలిపోయాయి. అయితే శాఖ తరపున కేవలం పైపులు మాత్రమే ఇస్తామని, జాయింట్‌ పనులు మాత్రం రైతులే చేసుకోవాలి. పైపులు మరమ్మతు చేయడానికి ఒప్పందంలో లేదు. 

Updated Date - 2022-05-21T07:03:28+05:30 IST