
కైవ్:ప్రపంచ దేశాలకు ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ సంచలన పిలుపునిచ్చారు. రష్యా దండయాత్రకు వ్యతిరేకంగా నిరసనలు చేపట్టాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ ప్రపంచ ప్రజలను కోరారు.రష్యా తన దండయాత్రను ఆపడానికి అంతర్జాతీయ ఒత్తిడిని పెంచే ప్రయత్నంలో భాగంగా ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాల పౌరులను వారి దేశాల్లో నిరసనలు ప్రారంభించాలని పిలుపునిచ్చారు.మార్చి 24వతేదీ నుంచి ఉక్రెయిన్‌కు మద్దతు ఇవ్వడానికి తమ దేశ చిహ్నాలతో వీధుల్లోకి రండి, మీ వాణిని వినిపించండి’’ అని జెలెన్స్కీ వీడియోలో కోరారు..
‘‘మనమందరం రష్యాను ఆపాలి. ప్రపంచం యుద్ధాన్ని ఆపాలి. ఉక్రెయిన్‌కు మద్దతుగా వ్యవహరించిన ప్రతి ఒక్కరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. శాంతియుతంగా ఉండేవారిపై ఉగ్రదాడులు కొనసాగుతున్నాయి’’ అని ఆయన అన్నారు.‘‘ యుద్ధం మొదలై ఇప్పటికే నెల రోజులైంది... ఇది నా హృదయాన్ని, ఉక్రేనియన్లందరి హృదయాలను విచ్ఛిన్నం చేస్తోంది. అందుకే యుద్ధానికి వ్యతిరేకంగా నిలబడమని నేను మిమ్మల్ని అడుగుతున్నాను’’ అని జెలెన్స్కీ విజ్ఞప్తి చేశారు.రష్యా-ఉక్రెయిన్ యుద్ధం 29వ రోజుకు చేరుకోగా రెండు దేశాలు మరో రౌండ్ చర్చలకు సిద్ధమవుతున్నాయి
ఇవి కూడా చదవండి