ఈ ఫొటోలు చూస్తే నవ్వాపుకోలేరు!

ABN , First Publish Date - 2020-10-29T16:07:37+05:30 IST

అడవి జంతువులను సడెన్‌గా చూస్తే మనకేమనిపిస్తుంది? భయమేస్తుంది. కానీ వాటికి కూడా మనసుంటుందని, భావాలుంటాయని చాలా సంఘటనలు నిరూపించాయి.

ఈ ఫొటోలు చూస్తే నవ్వాపుకోలేరు!

ఇంటర్నెట్ డెస్క్‌: అడవి జంతువులను సడెన్‌గా చూస్తే మనకేమనిపిస్తుంది? భయమేస్తుంది. కానీ వాటికి కూడా మనసుంటుందని, భావాలుంటాయని చాలా సంఘటనలు నిరూపించాయి. ఇదే కోవలో జంతువులు కామెడీ కూడా చేస్తాయని, అది చూస్తే మనం నవ్వాపుకోవడం కష్టమని తెలుసా? ఇటువంటి దృశ్యాలను మనకు పరిచయం చేయడం కోసమే ‘కామెడీ వైల్డ్ లైఫ్ ఫొటోగ్రఫీ అవార్డులు’ కూడాఅందిస్తున్నారు.


ఏటా జరిగే కామెడీ వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రఫీ అవార్డు వేడుకల్లో.. ఈ విన్నర్స్ లిస్ట్ వచ్చేసింది. ఈ పోటీలో ఫస్ట్ ప్లేస్ ఓ తాబేలు గెలుచుకుంది. మార్క్ ఫిజ్‌ప్యాట్రిక్ అనే వ్యక్తి ఆస్ట్రేలియలోనో క్వీన్స్‌లాండ్ సముద్రంలో ఈతకొడుతున్నాడు. లేడీ ఎలియట్ దీవి దగ్గరలో ఉండగా అతనికో దృశ్యం కనపడింది. అతనికి కొంచెం దూరంలో ఓ తాబేలు ఈదుతోంది. అది ముందుకు సాగినప్పుడల్లా దాని కాలు వెనక్కు ముడుచుకుంటోంది. ఆ సమయంలో అది తనవైపు మధ్యవేలు చూపించినట్లు మార్క్‌కు అనిపించింది. అంతే వెంటనే తన కెమెరాతో క్లిక్ మనిపించాడు. ఇలా మధ్యవేలు చూపించి తిట్టడాన్ని ఇంగ్లీషులో ‘ఫ్లిప్పింగ్ ది బర్డ్’ అని కూడా అంటారు. అందుకే ఈ ఫొటోకు ‘టెర్రీ ది టర్టిల్ ఫ్లిప్పింగ్ ది బర్డ్’ అని టైటిల్ పెట్టాడు. దీన్ని చూసిన కామెడీ అవార్డుల జడ్జిలు నవ్వాపుకోలేకపోయారు. ఈ చిత్రానికి ఫస్ట్ ప్రైజ్ ఇచ్చి సత్కరించారు.


మరో ఫొటోలో ఓ ఉడుత.. పాత పాశ్చాత్య సినిమాల్లో సింగర్ స్టిల్ ఇచ్చి పాడుతున్నట్లుగా ఉంది. పీపుల్స్ చాయిస్ అవార్డులో ఈ ఫొటోనే గెలిచింది. మరో దానిలో పొట్టలో గ్యాస్ రిలిజ్ చేసిన ఓ ఎలుగుబంటి, దాని వాసన చూస్కొని మూర్ఛపోయినట్లు సీక్వెన్స్ ఫొటోలు తీశారు. ఈ ఫొటోలు చూస్తే కచ్చితంగా మనం కూడా నవ్వాల్సిందే. ఈ పోటీలో రకరకాల క్యాటగిరీల్లో అవార్డులు అందిస్తారు. వీటిలో చాలా రకాల ఫొటోలు పోటీ పడ్డాయి. అయితే ప్రతి క్యాటగిరీలో విజేతగా నిలిచిన ఫొటోలు మనకు భలే వింతగా అనిపిస్తాయి. ప్రకృతిలో మనకు కనిపించకుండా ఇంత కామెడీ ఉందా? అని ఆశ్చర్యపోయేలా చేస్తాయి.



ప్రపంచ వ్యాప్తంగా ఉండే ఔత్సాహిక ఫొటోగ్రాఫర్లు ఇలాంటి కామెడీ ఫొటోలు క్లిక్ మనిపిస్తుంటారు. వాటినే ఈ కామెడీ వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రఫీ అవార్డుల పోటీకి పంపిస్తుంటారు. అప్పుడే నిద్ర లేచి ఒళ్లు విరుచుకుంటున్న రకూన్, నక్కతో నెగోషియేట్ చేస్తున్న ఎలుక, నీటిలో తేలుతూ యోగా చేస్తున్న సీ లయన్స్.. ఇలా ప్రకృతిలో తమకు కనిపించే ప్రకతి ఫన్నీ ఫొటోనూ కెమెరాలో బంధించి, వాటికి మంచి టైటిల్ పెట్టి పోటీకి పంపుతారు. వీటిని చూసిన జడ్జిలు టైటిల్‌కు ఫొటో ఎంత న్యాయం చేస్తోంది? ఫొటో ఎంత ఫన్నీగా ఉంది? అని నిర్ధారించి విజేతలను ప్రకటిస్తారు.


మరిన్ని ఫొటోలకు ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - 2020-10-29T16:07:37+05:30 IST