ఏసీబీ విచారణలో వెలుగులోకి
మహబూబ్‌నగర్, డిసెంబరు2: అవినీతి కేసులో పట్టుబడిన మునిసిపల్ కమిషనర్ వడ్డె సురేందర్ ఆస్తులు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. రూ.1.65 లక్షలు లంచం తీసుకుం టూ అక్టోబర్ 22న కమిషనర్ ఏసీబీకి పట్టుబడిన సంగతి తెలిసిందే..అయితే ఈ కేసులో రి మాండ్లో ఉన్న కమిషనర్‌ను ఏసబీ కస్టడీకి తీసుకుని విచారిస్తోంది. ఇప్పటికే అతడి బ్యాంక్ లాకర్లో రూ.28 లక్షల నగదును గుర్తించగా, తాజాగా ఆయన పేరిట ఉన్న ఆస్తుల వివరాల ను గుర్తించారు. పలు ప్రాంతాల్లో ఇల్లు, ప్లాట్లు, బంగారం, వెండి నగలను గుర్తించారు. వీటి విలువ దాదాపు రూ.2.79కోట్లు ఉంటుందని ఏసీబీ అధికారులు వెల్లడించారు. విచారణ అనం తరం బుధవారం ఏసీబీ అధికారులు కమిషనర్‌ను ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరుపరిచి రి మాండ్‌కు తరలించారు. ఇంకా కేసు విచారణలో ఉన్నదని తెలిపారు.