జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభం

ABN , First Publish Date - 2021-04-16T05:30:00+05:30 IST

మండలంలోని సీతాయిపల్లి, గౌరారం గ్రామాల్లో శుక్రవారం వరి కొనుగోలు కేంద్రాలను ఏపీడీ సుధీర్‌ ప్రారంభించారు.

జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభం
ఎల్లారెడ్డిలో కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభిస్తున్న అధికారులు

గాంధారి, ఏప్రిల్‌ 16: మండలంలోని సీతాయిపల్లి, గౌరారం గ్రామాల్లో శుక్రవారం వరి కొనుగోలు కేంద్రాలను ఏపీడీ సుధీర్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ ఐకేపీ మహిళా గ్రామ సంఘం ద్వారా కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేశాన్నారు. రైతు లు కొనుగోలు కేంద్రాలను వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ రాజమణి, డీపీఎం రమేష్‌, ఏపీఎం గంగారాజు, రైతు సమన్వయ సమితి మండ ల అధ్యక్షుడు మనోహర్‌రావు, నాయకులు రాజు, గౌస్‌ఖాన్‌ తదితరులు పాల్గొన్నారు.
ఎల్లారెడ్డి: ఎల్లారెడ్డి పట్టణ కేంద్రంలో ఉన్న వ్యవసాయ మార్కెట్‌లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ రాధ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతులు తమ ధాన్యాన్ని ఆరబెట్టి వ్యవసాయ మార్కెట్‌కు తీసుకురా వాలని తెలిపారు. దళారులకు అమ్మి మోసపోవద్దని ప్రభుత్వ మద్దతు ధర రూ.1,888 ఉంటుం దని తెలిపారు. మార్కెట్‌ యార్డులో రైతులకు అవసరమైన ఏర్పాట్లు అన్ని వసతులు సదుపాయాలు కల్పిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్‌ చైర్మన్‌ నరహ రి, డైరెక్టర్‌ జగన్‌గౌడ్‌, శ్రీనివాస్‌రెడ్డి, వెంకటరాంనాయక్‌, రాములు, రాజశేఖర్‌రెడ్డి, సుదర్శ న్‌ తదితరులు పాల్గొన్నారు.
సదాశివనగర్‌: రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ధాన్యం కొనుగోళ్లు నిర్వహి స్తామని చైర్మన్‌ గంగాధర్‌ తెలిపారు. మండలంలోని పద్మాజీవాడి, మొడెగాం గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎంపీపీ గైని అనసూయ ఆధ్వర్యంలో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వైస్‌ చైర్మన్‌ కుంట శ్రీనివాస్‌, ఆర్‌ఎస్‌ఎస్‌ మండల కన్వీనర్‌ శంకర్‌నాయక్‌, సర్పంచ్‌ కవిత, ఏఈవో స్నేహలత తదితరులు పాల్గొన్నారు.
బిచ్కుంద: రైతులు కష్టపడి పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలలో విక్రయించి సద్వినియోగం చేసుకోవాలని ఎంపీపీ అశోక్‌పటేల్‌ అన్నారు. శుక్రవారం మండలంలోని వాజీద్‌నగర్‌ గ్రామంలో వరికి మద్దతు ధరతో కొనుగోలు కేంద్రాన్ని ఎంపీపీ ప్రారంభిం చారు. రైతులు పండించిన పంటలను దళారులను అమ్మి మోసపోకుండా ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న కొనుగోలు కేంద్రాలలో విక్రయించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ అన సూయ, ఎంపీటీసీ సాయిలు, మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు బస్వారాజ్‌ పటేల్‌, వ్యవసాయాధికారి పోచయ్య తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-04-16T05:30:00+05:30 IST