‘మన ఊరు-మన బడి’ పనులకు త్వరలోనే శ్రీకారం

Published: Sat, 26 Mar 2022 23:59:19 ISTfb-iconwhatsapp-icontwitter-icon
మన ఊరు-మన బడి పనులకు త్వరలోనే శ్రీకారం

- ప్రతి మండలం, మున్సిపాలిటీల్లో రెండు పాఠశాలల ఎంపిక

- ప్రతి మండలానికి ప్రత్యేక అధికారి నియామకం..

- 15 రోజుల్లోగా పనులకు పరిపాలన అనుమతులు

(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)

ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేట్‌ పాఠశాలలకు దీటుగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభిం చిన మన ఊరు మన బడి కార్యక్రమం ద్వారా పనులు చేపట్టేందుకు సంబంధిత అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. రానున్న ఐదు రోజుల్లోపు ప్రతి మండలానికి, మున్సిపాలిటీకి రెండు పాఠశా లల చొప్పున ఎంపిక చేసి అక్కడ గుర్తించిన పనుల ను చేయ ను న్నారు. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో మొదటి విడతలో అత్య ధిక మంది విద్యార్థులున్న 33శాతం 191 పాఠశాల లను గుర్తించారు. ఈ పాఠశాలల్లో మౌలిక వసతు లు కల్పించేందుకు ప్రతిపాదనలు, అంచనాలను రూపొందిస్తున్నారు. ప్రధానంగా 12 రకాల పనులు చేయాలని పేర్కొన్నారు. గ్రీన్‌చాక్‌ బోర్డులు, విద్యా ర్థులు చదువుకునేందుకు వీలుగా డెస్క్‌ బల్లాలు, పెయింటింగ్‌ చేయడం వంటి పనులను రాష్ట్ర స్థాయి అధికారులే చేయనున్నారు. పాఠశాలల్లో మరుగుదొడ్లు, వంట గదులు, ప్రహారీ గోడల నిర్మా ణాలను గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ పథకం నిధులతో చేపట్టనున్నారు. పట్టణ ప్రాంతాల్లో అంచనాలు రూ పొందించాలని ప్రభుత్వం పేర్కొంది. నీటి సౌకర్యం, విద్యుత్‌, డైనింగ్‌ హాళ్ల నిర్మాణాలు, తరగతి గదుల నిర్మాణాలు, మరమ్మతు లకు సంబంధించి ప్రతిపాదనలు రూపొందించి సాఫ్ట్‌వేర్‌లో నమోదు చేయనున్నారు. 

మండలానికో అధికారి..

ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించేందుకు ప్రతి మండలానికి ఒక జిల్లాస్థాయి అధికారిని నియమి స్తున్నారు. సదరు అధికారులు ఎంపిక చేసిన పాఠ శాలలను సందర్శించి గుర్తించిన పనులను పరిశీలిం చి ధ్రువీకరించాల్సి ఉంటుంది. గత 15 రోజుల నుంచి ఆయా శాఖల అధికారులు జిల్లాలో ఎంపిక చేసిన పాఠశాలలను సందర్శించి పాఠశాలల ప్రధా నోపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు ఇచ్చిన ప్రతి పాదనలను పరిశీలించి అవసరమైన పనులను గుర్తించారు. ఆ పనులకు ఎంతెంత ఖర్చు అవుతుం దనే విషయమై అంచనాలను కూడా ఇంజినీరింగ్‌ అధికారులు రూపొందించారు. పనుల ప్రగతికి సం బంధించి ఎప్పటికప్పుడు ప్రత్యేకించి రూపొందించిన సాఫ్ట్‌వేర్‌లో నమోదు చేయాలని ప్రభుత్వం ఆదేశిం చింది. ఈ కార్యక్రమంపై జిల్లా కలెక్టర్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. గుర్తించిన అన్ని పనులకు 15 రోజుల్లోగా జిల్లా కలెక్టర్‌ పరిపాలనా అనుమతు లను మంజూరు చేయాలని ఆదేశించారు. పాఠశాల ల్లో చేపట్టే పనులకు సంబంధించిన ప్రతిపాదనలపై అంచనాలు ఇంకా పూర్తి కాలేదు. జిల్లాలో గుర్తించిన 191 పాఠశాలల్లో వచ్చే విద్యా సంవత్సరం నాటికి పనులు పూర్తి చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచే అన్ని పాఠశాలల్లో ఆంగ్లమాధ్యమంలో విద్యా బోధన చేయనున్నందున పాఠశాలలను ప్రైవేట్‌కు ధీటుగా తీర్చిదిద్దేందుకు ముందుకు సాగుతున్నారు. ఈ పనులను చేసే బాధ్యతలను పాఠశాలల యాజమాన్య కమిటీలకే అప్పగించారు. చేసిన పనులకు సామాజిక ఆడిట్‌ను కూడా నిర్వహించనున్నారు. 

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.