సకాలంలో రిటర్న్స్‌ దాఖలు చేయాలి

ABN , First Publish Date - 2022-05-25T06:20:25+05:30 IST

సకాలంలో టాక్స్‌ రిటర్న్స్‌ దాఖలు చేయాలని, జిల్లాలో జీఎస్‌టీ రిటర్న్స్‌ ఫైలింగ్‌ విషయంలో చాలామంది పెనాల్టీతో వేసే విధానానికి స్వస్తి పలకాలని ప్రతీనెల 20వ తేదీ నాటికి నూరుశాతం రిటర్న్స్‌ దాఖలు చేయాలని వాణిజ్యపన్నుల శాఖ జాయింట్‌ కమిషనర్‌ డి.శ్రీలక్ష్మి సూచించారు.

సకాలంలో రిటర్న్స్‌ దాఖలు చేయాలి
మాట్లాడుతున్న జాయింట్‌ కమిషనర్‌ శ్రీలక్ష్మి

పెనాల్టీ విధానాలకు స్వస్తి పలకాలి

వాణిజ్యపన్నుల శాఖ జేసీ శ్రీలక్ష్మి


భీమవరం టౌన్‌, మే 24 : సకాలంలో టాక్స్‌ రిటర్న్స్‌ దాఖలు చేయాలని, జిల్లాలో జీఎస్‌టీ రిటర్న్స్‌ ఫైలింగ్‌ విషయంలో చాలామంది పెనాల్టీతో వేసే విధానానికి స్వస్తి పలకాలని ప్రతీనెల 20వ తేదీ నాటికి నూరుశాతం రిటర్న్స్‌ దాఖలు చేయాలని వాణిజ్యపన్నుల శాఖ జాయింట్‌ కమిషనర్‌ డి.శ్రీలక్ష్మి సూచించారు. మంగళవారం క్లాత్‌ మర్చంట్స్‌ భవనంలో జరిగిన జిల్లా ప్రాక్టీషనర్స్‌ అండ్‌ కన్సల్టెంట్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో వార్షిక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి నెలా 20వ తేదీలోపు 80 శాతం మాత్రమే రిటర్న్స్‌ దాఖలు చేస్తున్నారని, మిగిలిన 20 శాతం మంది పెనాల్టీలతో దాఖలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనివల్ల వ్యాపారస్తులకు ఆదాయపరంగా నష్టం కలుగుతుందన్నారు. అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ రామరాజు మాట్లాడుతూ ప్రాక్టీషనర్లందరూ జీఎస్‌టీ చట్టం, వ్యాపారులకు అవసరమైన పరిజ్ఞానం కలిగి ఉండాలన్నారు. ఈ సందర్భంగా ప్రాక్టీషనర్స్‌కు వున్న సందేహాలను నివృత్తి చేసిన అనంతరం ఆమెను ఘనంగా సత్కరించారు. జిల్లా అధ్యక్షుడు కేవీ కోటేశ్వరరావు, భీమవరం అసోసియేషన్‌ అధ్యక్షుడు ఆకుల సాయి, అసిస్టెంట్‌ కమిషనర్‌ గ్లోరి కుమారి, ఏపీసీటీఎన్‌జీవో రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి జి.సత్యనారాయణ తదితరులు పాల్గొనారు.

Updated Date - 2022-05-25T06:20:25+05:30 IST