కమర్షియల్ విజిట్ వీసాలపై కువైత్ కీలక నిర్ణయం

ABN , First Publish Date - 2022-03-06T17:59:08+05:30 IST

కువైత్ అంతర్గత మంత్రిత్వశాఖ అన్ని రకాల విజిట్ వీసాలు, ప్రధానంగా ప్రవాస ఫ్యామిలీలకు ఇవ్వాలని నిర్ణయించిన తరుణంలో కమర్షియల్ విజిట్ వీసాల జారీని మాత్రం తాత్కాలికంగా నిలిపివేయనున్నట్లు తెలిపింది.

కమర్షియల్ విజిట్ వీసాలపై కువైత్ కీలక నిర్ణయం

కువైత్ సిటీ: కువైత్ అంతర్గత మంత్రిత్వశాఖ అన్ని రకాల విజిట్ వీసాలు, ప్రధానంగా ప్రవాస ఫ్యామిలీలకు ఇవ్వాలని నిర్ణయించిన తరుణంలో కమర్షియల్ విజిట్ వీసాల జారీని మాత్రం తాత్కాలికంగా నిలిపివేయనున్నట్లు తెలిపింది. ముఖ్యంగా అరబ్ దేశాల పౌరులకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కమర్షియల్ విజిట్ వీసాలు ఇవ్వకూడదని నిర్ణయించింది. దీనికి కారణం ఇటీవల ఆ దేశాలకు చెందిన అనేక మంది భిక్షాటన చేస్తూ పట్టుబడటమే. అయితే, పవిత్ర రంజాన్ మాసం కంటే ముందే ఆయా దేశాలకు చెందిన చాలా మంది కువైత్ చేరుకున్నట్లు మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి వెల్లడించారు. కాగా, రెసిడెన్సీ వ్యవహారాల విభాగం విజిట్ వీసాలను జారీ చేస్తుందని, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ), ఎయిర్‌లైన్స్ తప్పనిసరిగా టీకా ధృవీకరణ పత్రాలను తనిఖీ చేయాలని ఆయన అన్నారు. అలాగే హెల్త్ స్టేటస్ నిరంతర పర్యవేక్షణ దృష్ట్యా మంత్రిత్వ శాఖ త్వరలో కొత్త విధానాలను ప్రకటించాలని భావిస్తోందని పేర్కొన్నారు. దీనిలో భాగంగా దేశం వెలుపల, రిమోట్‌మోడ్‌లో పని చేసే ప్రవాసుల కోసం రెసిడెన్సీల పునరుద్ధరణను నిలిపివేయడం వంటివి అని తెలియజేశారు.        

Updated Date - 2022-03-06T17:59:08+05:30 IST