వెంకటగిరి కమిషనర్‌పై కౌన్సిలర్లు గరంగరం!

Nov 30 2021 @ 23:06PM

వెంకటగిరి(టౌన్‌), నవంబరు 30: మున్సిపల్‌ సాధారణ కౌన్సిల్‌ సమావేశం మంగళవారం ప్రశాం తంగా ముగిసింది. ముందుగా పలు అంశాలపై కౌన్సిల్‌ ఆమోదం పొం దారు. గత ఏడాదిగా బిల్లులు మం జూరు కావడం లేదని కమిషనర్‌ను నిలదీశారు.  ఎమ్మెల్యేకు మంచి పే రు వస్తుందన్న ఉద్దేశంతో బిల్లులు మంజూరు చేయడం ఆగ్రహం వ్యక్తం చేశారు. వర్షాలకు పలు వార్డుల్లో తాగునీటి సమస్య  ఏర్పడిందని, వీధి లైట్లు వెలగడం లేదని ఆరోపించారు. పారిశుధ్యం క్షీణించిందని ధ్వజమెత్తారు. మున్సిపాలిటీలో పనిచేసే ఓ అధికారి అవినీతిపై విచారణ చేయించాలని అర్జీ ఇచ్చినా ఇప్పటివరకు స్పందించ లేదన్నారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా వార్డుల్లో తిరగాలంటే సిగ్గుగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.