గుంటూరు, డిసెంబరు 2: వాణిజ్యపన్నులశాఖ అడిషనల్ కమిషనర్ డి.రమేష్ గురువారం గుంటూరు పర్యటనకు వస్తున్నారు. జిల్లాకేంద్రం గుంటూరు జిన్నాటవర్ సెంటర్లోని వసుంధరభవన్‌లో నరసరావుపేట డివిజన్ సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. డివిజన్లో పాతబకాయిలు, పన్నుల వసూళ్ళు, వృద్ధి వంటి వివరాలను అడిగి తెలుసుకోనున్నారు. అనంతరం చిలకలూరిపేట సర్కిల్‌ను సందర్శిస్తారని సమాచారం. ఈమేరకు సీటీశాఖ నరసరావుపేట డివిజన్ అధికారులకు సమాచారం అందించారు. అలానే సీటీశాఖ గజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడిగా రమేష్ వ్యవహరిస్తుండటంతో ఆయన్ను అధికారులు కలిసి సమస్యలు తెలియజేయనున్నారు.