నకిలీ విత్తనాలు అంటగడితే ఉపేక్షించం: కమిషనర్‌ విష్ణు వారియర్‌

ABN , First Publish Date - 2021-06-07T22:53:10+05:30 IST

నగరంలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. జిల్లా పోలీస్‌ కమిషనర్‌ విష్ణు వారియర్‌ ఆధ్వర్యంలో ఈ తనిఖీలు చేశారు.

నకిలీ విత్తనాలు అంటగడితే ఉపేక్షించం: కమిషనర్‌ విష్ణు వారియర్‌

ఖమ్మం: నగరంలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. పోలీస్‌ కమిషనర్‌ విష్ణు వారియర్‌ ఆధ్వర్యంలో ఈ తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో అక్రమంగా లైసెన్స్‌ లేకుండా మిరప విత్తనాలు రైతులకు అంటగడుతున్న 8 మందిని గుర్తించి అరెస్ట్ చేసినట్లు చెప్పారు. వారి వద్ద నుంచి 16 లక్షల రూపాయల విలువైన విత్తనాలు సీజ్ చేసినట్లు విష్ణు వారియర్‌  చెప్పారు. పరారీలో మరికొంతమంది ఉన్నారన్నారు. త్వరలో వారిని కూడా అరెస్ట్‌ చేస్తామని విష్ణు వారియర్‌ తెలిపారు. నకిలీ మిరప విత్తనాలను రైతులకు అంటగడితే కఠిన చర్యలు తీసుకుంటామని విష్ణు వారియర్‌ హెచ్చరించారు. 

Updated Date - 2021-06-07T22:53:10+05:30 IST