former Supreme Court judge: దేవాలయాలపై సుప్రీం మాజీ జడ్జి సంచలన వ్యాఖ్యలు...వీడియో వైరల్

ABN , First Publish Date - 2022-08-29T13:36:35+05:30 IST

సుప్రీంకోర్టు మాజీ జడ్జి(former Supreme Court judge) జస్టిస్ ఇందు మల్హోత్రా(Indu Malhotra) దేవాలయాలపై(temples) సంచలన వ్యాఖ్యలు చేశారు....

former Supreme Court judge: దేవాలయాలపై సుప్రీం మాజీ జడ్జి సంచలన వ్యాఖ్యలు...వీడియో వైరల్

న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు మాజీ జడ్జి(former Supreme Court judge) జస్టిస్ ఇందు మల్హోత్రా(Indu Malhotra) దేవాలయాలపై(temples) సంచలన వ్యాఖ్యలు చేశారు. కమ్యూనిస్టు ప్రభుత్వాలు(Communist govts) ఆదాయం( revenue) కోసం దేవాలయాలను స్వాధీనం చేసుకుంటున్నాయని మాజీ జడ్జి ఇందు మల్హోత్రా కొంతమంది వ్యక్తులతో మాట్లాడుతూ వ్యాఖ్యానించారు. సోషల్ మీడియాలో మాజీ జడ్జి వ్యాఖ్యల వీడియో వైరల్ అయింది.(viral video)సోషల్ మీడియాలో ( social media) హల్ చల్ చేస్తున్న ఈ వీడియోలో కేవలం ఆదాయం కోసమే కమ్యూనిస్ట్ ప్రభుత్వాలు హిందూ దేవాలయాలను స్వాధీనం చేసుకుంటున్నాయని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ఇందు మల్హోత్రా చెప్పారు.






కేరళ(Kerala) రాష్ట్రంలోని తిరువనంతపురంలోని శ్రీ పద్మనాభ స్వామి ఆలయ(Sree Padmanabha Swamy Temple) నిర్వహణ అంశంపై 2020వ సంవత్సరంలో ఇప్పటి భారత ప్రధాన న్యాయమూర్తి యూయూ లలిత్(Chief Justice of India UU Lalit), జస్టిస్ ఇందు మల్హోత్రాలతో కూడిన ధర్మాసనం తీసుకున్న నిర్ణయాన్ని ఆమె ప్రస్థావించారు.‘‘ఆదాయం కోసమే కేవలం హిందూ దేవాలయాలను మాత్రమే స్వాధీనం చేసుకున్నారు కాబట్టి నేను, జస్టిస్ లలిత్ అనుమతించలేదు’’ అని జస్టిస్ ఇందూ చెప్పారు. దీంతో మీ గురించి గర్వంగా భావిస్తున్నామని ఒక మహిళ వ్యాఖ్యానించడం, దానికి రిటైర్డ్ జడ్జి ఆ మహిళకు కృతజ్ఞతలు చెప్పడం వీడియోలో చూడవచ్చు.



Updated Date - 2022-08-29T13:36:35+05:30 IST