నేటినుంచి కమ్యూనిటీ కరోనా వ్యాక్సినేషన్‌

ABN , First Publish Date - 2021-03-01T05:26:46+05:30 IST

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఒకటో తేదీనుంచి ప్రజలకు కరోనా టీకా అందుబాటులోకి రానుంది. ఖమ్మం జిల్లాలో నేటి నుంచి కరోనా టీకా సేవలు ప్రజలకు అందుబాటులో ఉంటాయని కలెక్టర్‌ ఆర్వీకర్ణన్‌ ఒక ప్రకటనలో తెలిపారు.

నేటినుంచి కమ్యూనిటీ కరోనా వ్యాక్సినేషన్‌

సామాన్య ప్రజలకు అందుబాటులోకి కొవిడ్‌ టీకా

ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో లభ్యం

టీకా ధర రూ250, సర్వీస్‌ చార్జ్‌ రూ100  

ప్రకటించిన ఇరు జిల్లాల కలెక్టర్లు 

ఖమ్మం కలెక్టరేట్‌/ఖమ్మం సంక్షేమ విభాగం/కొత్తగూడెం కలెక్టరేట్‌, ఫిబ్రవరి 28: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఒకటో తేదీనుంచి ప్రజలకు కరోనా టీకా అందుబాటులోకి రానుంది. ఖమ్మం జిల్లాలో నేటి నుంచి కరోనా టీకా సేవలు ప్రజలకు అందుబాటులో ఉంటాయని కలెక్టర్‌ ఆర్వీకర్ణన్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రితో పాటు నగరంలోని మమత జనరల్‌ ఆసుపత్రి, శ్రీరక్ష ప్రైవేటు ఆసుపత్రిలో సోమవారం లాంఛనంగా కోవిడ్‌-19 టీకా కార్యక్రమం ప్రారంభించనున్నట్లు కలెక్టర్‌ తెలిపారు. మంగళవారం నుంచి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రితో పాటు నగరంలో శ్రీరాం కిడ్నీసెంటర్‌, సృజన ఆర్థోపెడిక్‌, తరుణ్‌ ఆసుపత్రి, న్యూలైఫ్‌ ఎమర్జెన్సీ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి, శివ ఎమర్జెన్సీ మల్టిస్పెషాలిటీ ఆసుత్రి, ప్రసూన ఆర్థోపెడిక్‌ మల్టీస్పెషాలిటీ, శ్రీరక్ష ఆసుపత్రి, అఖిల కంటి ఆసుపత్రుల్లో కరోనా టీకా ప్రజలకు అందుబాటులో ఉంటుందని కలెక్టర్‌ వెల్లడించారు. కరోనా టీకాను ప్రజలు నిర్భయంగా వేయించుకోవచ్చని, జిల్లా ప్రధాన ఆసుపత్రిలో పూర్తిగా ఉచితంగా కరోనా టీకా వేస్తారని తెలిపారు. ప్రైవేటు  ఆసుపత్రుల్లో మాత్రం టీకా ధర రూ.250, సర్వీస్‌ చార్జ్‌ కింద రూ.100 చెల్లించాల్సి ఉంటుందన్నారు. కరోనా టీకా వేయించుకోదలచిన వారు ఠీఠీఠీ.ఛిౌఠీజీుఽ.జీుఽ అనే వెబ్‌సైట్‌లో తమ పేర్లను నమోదు చేసుకోవాలని, నిర్ధేశించిన తేదీల్లో కరోనా టీకా వేయించుకోవాలని కలెక్టర్‌ జిల్లా ప్రజలకు విన్నవించారు. 45 ఏళ్ల నుంచి 59 ఏళ్ల మధ్య వయస్సు కలిగిన వారు ఏదైనా వ్యాధులకు వైద్య చికిత్సలు పొందుతుంటే సంబందిత వైద్య ధ్రువీకరణ పత్రాలు టీకా తీసుకునేందుకు సంబందిత డాక్టర్‌ నుంచి పొందిన ధ్రువీకరణ పత్రాలను విధిగా కరోనా టీకా వేయించుకునే ఆసుపత్రికి తీసుకెళ్లాలని కలెక్టర్‌ సూచించారు. 60ఏళ్ల పైబడిన వారికి ఏలాంటి ధ్రువీకరణ పత్రాలు అవసరం ఉండదన్నారు. నేరుగా టీకా వేయించుకోవచ్చని తెలిపారు. టీకా వేయించుకునేందుకు వెళ్లేవారు భోజనం చేసి వెళ్లాలని, ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 4గంటలలోపు మాత్రమే టీకా వేయించుకునేందుకు వెళ్లాలని కలెక్టర్‌ ప్రకటనలో తెలిపారు. 

భద్రాద్రిజిల్లాలో..

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సోమవారం నుంచి ప్రజలకు కోవిడ్‌ వ్యాక్సిన్‌ అందుబాటులో ఉంటుందని కలెక్టర్‌ ఎంవీ రెడ్డి తెలిపారు. కోరోనా వ్యాక్తినేషన్‌పై సోమవారం తన క్యాంపు కార్యలయం నుంచి జిల్లా టాస్క్‌పోర్సు కమిటీతో మాట్లాడారు. కొత్తగూడెంలోని ఏరియా ఆసుపత్రిలో ప్రజలకు ఉచితంగా టీకా వేస్తారని తెలిపారు. తదుపరి అన్ని ప్రభుత్వఆసుప్రతిలో ఉచితంగా టీకా ఇస్తారాన్నారు. వ్యాక్సిన్‌పై ప్రజలు నమ్మవద్దన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌లు కె వెంకటేశ్వర్లు, అనుదీప్‌, జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ భాస్కర్‌ నాయక్‌, అస్పత్రుల సమన్వయ అధికారి డాక్టర్‌ ముక్కంటేశ్వరరావు, ఏరియా ఆసుపత్రి పర్యవేక్షకులు డాక్టర్‌ సరళ, వ్యాక్సినేషన్‌ ప్రొగ్రాం అధికారి డాక్టర్‌ నాగేంద్ర ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-03-01T05:26:46+05:30 IST