యెల్లో లైన్ స్టేషన్లలో ఉచిత వైఫై సేవలు : ఢిల్లీ మెట్రో

ABN , First Publish Date - 2021-10-17T21:17:42+05:30 IST

ఢిల్లీ మెట్రోలోని యెల్లో లైన్ స్టేషన్లలో ప్రయాణికులకు

యెల్లో లైన్ స్టేషన్లలో ఉచిత వైఫై సేవలు : ఢిల్లీ మెట్రో

న్యూఢిల్లీ : ఢిల్లీ మెట్రోలోని యెల్లో లైన్ స్టేషన్లలో ప్రయాణికులకు ఉచిత హై స్పీడ్ వైఫై సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఈ మార్గంలోని అన్ని (37) స్టేషన్లలోనూ ఈ సేవలు ఆదివారం నుంచి అందుబాటులోకి వచ్చాయని ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (కార్పొరేట్ కమ్యూనికేషన్స్) అనూజ్ దయాల్ చెప్పారు. 


ఉత్తర ఢిల్లీ నుంచి గురుగ్రామ్ వరకు యెల్లో లైన్ మార్గం ఉంది. ఔటర్ ఢిల్లీ, ఉత్తర ఢిల్లీ, సెంట్రల్ ఢిల్లీ, దక్షిణ ఢిల్లీ, గురుగ్రామ్‌లను కలిపే ఈ మార్గంలో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. రైలు ఎక్కువగా భూగర్భంలోనే ప్రయాణిస్తుంది. ఈ మార్గంలోని 37 స్టేషన్లలో ప్రయాణికులకు నిరంతరాయ ఇంటర్నెట్ సేవలను అందజేయడం కోసం 330కి పైగా యాక్సెస్ పాయింట్స్‌ను ఏర్పాటు చేసినట్లు దయాల్ చెప్పారు. విద్యార్థులకు ఈ సేవలు గొప్ప వరమని తెలిపారు. ప్రయాణికులు ఈ-మెయిల్, ఫేస్‌బుక్, గూగుల్ సెర్చ్, వాట్సాప్, వీడియో, ఆడియో కాల్స్ మొదలైనవాటిని వాడుకోవచ్చునని చెప్పారు. 


Updated Date - 2021-10-17T21:17:42+05:30 IST