World's best boss: ఉద్యోగులకు ఊహించని సర్‌ప్రైజ్.. ఆస్ట్రేలియా కంపెనీ వినూత్న ఆఫర్

ABN , First Publish Date - 2022-07-06T02:27:15+05:30 IST

సాధారణంగా చాలా సంస్థలు తమ ఉద్యోగులకు రకరకాలు బెనిఫిట్స్ ఇస్తుంటాయి

World's best boss: ఉద్యోగులకు ఊహించని సర్‌ప్రైజ్.. ఆస్ట్రేలియా కంపెనీ వినూత్న ఆఫర్

సాధారణంగా చాలా సంస్థలు తమ ఉద్యోగులకు రకరకాలు బెనిఫిట్స్ ఇస్తుంటాయి. హెల్త్ ఇన్సూరెన్స్, ఇతర అలవెన్సులు ఇస్తుంటాయి. కొన్ని సంస్థలు టూర్ ప్యాకెజ్‌లు, స్పెషల్ గిఫ్ట్ వోచర్‌లు, బోనస్‌లు కూడా ఇస్తుంటాయి. ఇటీవల ఓ కంపెనీ తమ సంస్థలో పని చేస్తున్న పెళ్లి కాని ఉద్యోగులకు పెళ్లి సంబంధాలు కూడా చూస్తోంది. Australiaకు చెందిన ఓ కంపెనీ తమ ఉద్యోగులందరినీ రెండు వారాల హాలీడే ట్రిప్ కోసం ఇండోనేసియాలోని బాలికి తీసుకెళ్లింది. 



ఆస్ట్రేలియాలోని సిడ్నీకి చెందిన సూప్ ఏజెన్సీ సంస్థ.. తమ ఉద్యోగులను రెండు వారాల పాటు ఇండోనేషియాలోని బాలి ద్వీపానికి తీసుకెళ్లింది. ఆ రెండు వారాలను పెయిడ్ లీవ్‌గా పరిగణించింది. అంతేకాదు బాలిలో ఉద్యోగులు పెట్టిన మొత్తం ఖర్చులను కూడా కంపెనీయే చెల్లించింది. రెండు వారాల పాటు ఆ ఉద్యోగులందరూ బాలిలో సరదాగా గడిపి రిఫ్రెష్ అయ్యారు. చిన్న పిల్లల్లా ఆడిపాడారు. రకరకాల ఆటలు ఆడారు. 


`ఉద్యోగులపై ఒత్తిడి తగ్గించడానికి, వారు రిఫ్రెష్ అయ్యేందుకే ఇలాంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. 

ఇలాంటి టూర్‌ల వల్ల ఉద్యోగులకు కంపెనీ పట్ల అంకిత భావం, నిబద్దత, గౌరవం పెరుగుతాయి. దాని వల్ల ప్రొడక్టివిటీ కూడా పెరుగుతుంద`ని సూప్‌ మేనేజింగ్ డైరెక్టర్ కాట్యా వకులెంకో అన్నారు. ఈ ఏడాది మే నెలలో ఈ టూర్ జరిగింది. దానికి సంబంధించిన వీడియోను సంస్థ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. 

Updated Date - 2022-07-06T02:27:15+05:30 IST