పాడి రైతులకు పరిహారం అందేనా..?

ABN , First Publish Date - 2020-08-09T11:01:33+05:30 IST

సీజనల్‌ వ్యాధులతో మృత్యువాత పడిన మూగజీవాల నష్ట పరిహారం కోసం పశు పోషకులు ఎదురు చూస్తున్నారు.

పాడి రైతులకు పరిహారం అందేనా..?

జిల్లాలో 1500 మంది లబ్ధిదారుల నిరీక్షణ

నిధుల మంజూరులో తీవ్ర జాప్యం

15రోజుల్లోనే  రావాల్సి ఉన్నా.. నెలల తరబడి పెండింగ్‌

రూ.98 లక్షలు మాత్రమే చెల్లింపులు


ఒంగోలు(జడ్పీ), ఆగస్టు 8 : సీజనల్‌ వ్యాధులతో మృత్యువాత పడిన మూగజీవాల నష్ట పరిహారం కోసం పశు పోషకులు ఎదురు చూస్తున్నారు. పశువులు, గొర్రెలు, మేకలు ప్రమాదవశాత్తు సీజనల్‌ వ్యాధులబారిన పడి చనిపోతే వాటికి నష్టపరిహారం అందేలా  ప్రభుత్వం గతేడాది పథకం ప్రవే శపెట్టింది. పథకం ప్రారంభ దశలో లబ్ధిదారులకు డబ్బులు బాగానే అం దేవి.  నష్టపోయిన వ్యక్తి దరఖా స్తు చేసుకుంటే పరిహార సొమ్ము నిర్ణీత గడువులోపు వారి బ్యాంకు ఖాతాలో జమ అయ్యేది.  రానురాను దరఖా స్తుల సంఖ్య పెరుగు తుండడంతో నష్టపరిహారం చెల్లింపులో తీవ్ర జాప్యం జరుగుతోంది.  పశువులపైనే జీవనభృతి పొందుతున్న అనేక మంది అటు పరిహారం అందక, ఇటు జీవాలు మృతి చెందడంతో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఏడాదికి ఒక్కో రైతుకు 5 పశువుల వరకూ ఈ పథకం వర్తిస్తుంది. పశువుల జాతిని బట్టి రూ.15,000, రూ.30,000 నష్టపరిహారం అందుతుంది. గొర్రెలు, మేకలకైతే రూ.6వేలు చెల్లిస్తారు.


చనిపోయిన పశువుల తాలూకా సమాచా రాన్ని సంబంధిత పశువైద్యుడికి పంపాలి. ఫొటోలు తీసి వివరాల న్నింటినీ ఆన్‌లైన్‌లో నమాదు చేస్తారు. జిల్లా అధి కారికి నివేదిక అందిన తరువాత గరిష్ఠంగా పక్షం రోజుల్లో రైతు ఖాతాలో  పరిహార సొమ్ము జమ అవ్వాలి. కానీ నెలలు గడుస్తున్నా పరిహారం అందక పశువులన కోల్పోయిన రైతులు తీవ్ర ఇక్కట్ల పాలవుతున్నారు.


జిల్లాలో 1500 మంది లబ్ధిదారుల ఎదురు చూపులు

జిల్లాలో 1500 మందికి పైనే నష్ట పరిహారం కోసం ఎ దురు చూస్తున్నారు. ఆ మొత్తం విలువ రూ.4కోట్లకు పైనే ఉంటుంది. ఇప్పటి వరకూ రైతుల ఖాతాలో జమ అయినది కేవలం రూ.98 లక్షలు మాత్రమే. మిగతా వారంతా ఎదురు చూ స్తున్నారు. జిల్లాలో వ్యవసాయ అనుబంధ రం గంగా పాడిపైనే ఆధారపడి జీవించే వారి సంఖ్య గణనీయంగా ఉంది. 


నిధుల మంజూరలులో తీవ్ర జాప్యం

జిల్లాలో దాదాపు 2300 మూగ జీవాలు వివిధ కారణాలతో చనిపోయాయి. వాటిలో గేదెలు 1500 ఉండగా , 310 ఆవులు, 500 గొర్రెలు, 80కిపైగా మేకలున్నాయి. వాటికి చెందిన పరిహారం కేవలం రూ.98 లక్షలు మాత్రమే చెల్లించగా దాదాపు రూ.2.50 కోట్లకు పైగా బిల్లులు ఆమోదం పొంది సీఎఫ్‌ఎం ఎస్‌కు చేరాయి. లబ్ధిదారులకు జమ కావల్సి ఉంది.


తక్షణమే మంజూరు చేయాలి

కరోనాతో ఆర్థికంగా చితికి పోయిన పాడి రైతులను ఆదుకునే ఉద్దేశంతో అనేక పథకాలకు అంకురార్పణ చేసిన ప్రభుత్వాలు నిబంధనల ప్రకారం తమకు రావలసిన డబ్బుల విషయంలో ఆలస్యం చేయడంతో  బాధిత రైతులు ఆవేదన చెందుతున్నారు. తమకు రావలసిన పరిహారాన్ని అందించాలని కోరుతున్నారు. 


Updated Date - 2020-08-09T11:01:33+05:30 IST