ఎకరాకు రూ.కోటిన్నర పరిహారం ఇవ్వాలి

ABN , First Publish Date - 2021-12-04T04:31:52+05:30 IST

ర్నూలు నుంచి దోర్నాల వరకూ వెళ్తున్న 340 సీ జాతీయ రహదారి నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులకు ఎకరాకు రూ. కోటి యాభైౖ లక్షల పరిహారం ఇవ్వాలని సీపీఐ లిబరేషన జిల్లా నాయకుడు వెంకటేశ్వర్లు, తాలుకా నాయకుడు గోపాలక్రిష్ణ డిమాండ్‌ చేశారు.

ఎకరాకు రూ.కోటిన్నర పరిహారం ఇవ్వాలి

నందికొట్కూరు రూరల్‌, డిసెంబరు 3 : కర్నూలు నుంచి దోర్నాల వరకూ వెళ్తున్న 340 సీ జాతీయ రహదారి నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులకు ఎకరాకు రూ. కోటి యాభైౖ లక్షల పరిహారం ఇవ్వాలని సీపీఐ లిబరేషన జిల్లా నాయకుడు వెంకటేశ్వర్లు, తాలుకా నాయకుడు గోపాలక్రిష్ణ డిమాండ్‌ చేశారు. శుక్రవారం రైతులు తహసీల్దార్‌ రాజశేఖరబాబుకు వినతి పత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ జాతీయ రహదారి అధికారులు 2017 - 2018  మార్కెట్‌ ధర ప్రకారం భూములకు విలువను నిర్ణయిస్తామనడం సమంజసం కాదన్నారు. ఇది రైతులను మోసం చేయడమే అన్నారు. బ్రాహ్మణకొట్కూరు, దామగట్ల, బొల్లవరం, నందికొట్కూరు గ్రామాల రైతులకు జాతీయ రహదారిలో భూములు కోల్పోతున్న వారికి ఎకరాకు కోటిన్నర రూపాయల దాకా పరిహారం అందించాలన్నారు. 2020 - 21 మార్కెట్‌ ధరల ప్రకారం ఽధర నిర్ణయించి 15 శాతం రెట్టింపు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. లేని పక్షంలో ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. 



Updated Date - 2021-12-04T04:31:52+05:30 IST