భూములు, పంటలు కోల్పోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలి

ABN , First Publish Date - 2021-10-17T06:30:56+05:30 IST

అతివృష్ఠి, వరదలతో చెక్‌డ్యాం ల కింద భూములు, పంటలు కోల్పోయిన రైతులకు వెం టనే తగిన నష్టపరిహారం చెల్లించాలని జిల్లా ఎంపీ ధర్మ పురి అర్వింద్‌ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

భూములు, పంటలు కోల్పోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలి
పచ్చలనడ్కుడలో చెక్‌డ్యాంను పరిశీలించిన అనంతరం విలేకరులతో మాట్లాడుతున్న ఎంపీ అర్వింద్‌

భూములు, పంటలు కోల్పోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలి 

ఎంపీ ధర్మపురి అర్వింద్‌ డిమాండ్‌ 

వేల్పూర్‌, అక్టోబరు 16: అతివృష్ఠి, వరదలతో చెక్‌డ్యాం ల కింద భూములు, పంటలు కోల్పోయిన రైతులకు వెం టనే తగిన నష్టపరిహారం చెల్లించాలని జిల్లా ఎంపీ ధర్మ పురి అర్వింద్‌ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. వే ల్పూర్‌ మండలం పచ్చలనడ్కుడ గ్రామ పెద్దవాగులో, అ లాగే మోతె కప్పాలవాగులో నిర్మించిన చెక్‌డ్యాంలు ఇటీవ ల కురిసిన భారీ వర్షాల వల్ల కోతకు గురికాగా.. శనివార ం ఎంపీ వాటిని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కమీషన్‌లకు కక్కుర్తిపడి కచ్చితమైన వర ద ప్రవాహాన్ని అంచనా వేయకుండా, నాణ్యత ప్రమాణా లు పాటించకుండా చెక్‌డ్యాంలు నిర్మించారని ఆరోపించా రు. పచ్చలనడ్కుడ పెద్దవాగులో ఎనిమిది అడుగుల ఎ త్తు ఉన్న చెక్‌డ్యాంను మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి తన బంధువులైన కాంట్రాక్టర్‌ల లబ్ధికోసం, ఆయన కమీషన్‌ల కోసం 12అడుగుల వరకు పెంచారని ఆరోపించారు. ఈ చెక్‌డ్యాంల నిర్మాణంలో పటిష్ఠమైన చర్యలు చేపట్టకపోవ డం వల్ల చెక్‌డ్యాంలు తెగిపోయి రైతుల భూములు, సా గు చేసిన పంటలు వాగులో కొట్టుకుపోయాయని అన్నా రు. రైతుల భూములలో ప్రస్తుతం ఇసుక మేటలు పేరు కుపోయి పంట సాగుకు పనికిరాకుండా పోయాయని ఆ యన ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్‌ దత్తత గ్రా మమైన మోతెలో ఇప్పటి వరకు చేసిన అభివృద్ధి ఏమిలే దన్నారు. కేసీఆర్‌కు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి చేత కావడంలేదని, అభివృద్ధికి అవసరమైన పైసలు లేవని రా ష్ట్రాన్ని అన్ని విధాలా నష్టపరుస్తున్నారన్నారు. పంటలు, విలువైన భూములు కోల్పోయిన రైతులు ప్రస్తుతం దిక్కు లేని వారయ్యారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి రైతులపై ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా వెంటనే నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. ఆయన వెంట బీజేపీ రాష్ట్ర నాయకుడు ఏలేటి మల్లికార్జున్‌రెడ్డి, బీజేపీ మండల  అధ్యక్షుడు రమేష్‌రెడ్డి, జిల్లా నాయకులు మల్కన్నగారి మోహన్‌, బీజేపీ నాయకులు పోతుల బాల్‌కిషన్‌, నిమ్మల పెద్దన్న, అంకన్నగారి గణేష్‌, బద్దం గంగాధర్‌, నల్లవెల్లి చి న్న భూమన్న, వేల్పూర్‌ మండల బీజేపీ నాయకులు, కా ర్యకర్తలు పాల్గొన్నారు. 

కార్యకర్త చికిత్స కోసం రూ.50వేల ఆర్థికసాయం

పెద్దబజార్‌: నగరంలోని ఎల్లమ్మగుట్టలో గల ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిట్యాల గంగారాం అనే బీజేపీ కార్యర్తను శనివారం ఎంపీ అర్వింద్‌ పరామర్శించా రు. గంగారాం ఆరోగ్య పరిస్థితిని కుటుంబ సభ్యులు, వై ద్యులను అడిగి తెలుసుకొని కార్పస్‌ ఫండ్‌ ద్వారా 50వేల రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ.. బూత్‌స్థాయి కార్యకర్తలను సుమారు 20వేల మందిని సభ్యులుగా చేర్చామని వెల్లడి ంచారు. పార్టీ కోసం పనిచేసే కార్యకర్తల సంక్షేమం కోసం అన్ని విధాలుగా తాను అండగా ఉంటానని చెప్పారు. పా ర్లమెంట్‌ నియోజకవర్గం పరిధిలోని కార్యకర్తలు ఆపదలో ఉన్నవారు కాల్‌ సెంటర్‌ ద్వారా ఎంపీ కార్యాలయానికి సంప్రదించాలని కోరారు. 

Updated Date - 2021-10-17T06:30:56+05:30 IST