అవకతవకలకు ఆస్కారం లేకుండా పరిహారం

ABN , First Publish Date - 2020-12-04T04:28:42+05:30 IST

పోర్టు కనక్టెవిటీ రోడ్డు నిర్మాణంలో నరవ గ్రామం సర్వే నంబరు 54లో భూములు కోల్పోయిన వారికి నష్ట పరిహారం అందజేసే విషయంలో ఎలాంటి అవకతవకలకూ ఆస్కారం లేదని ఎన్‌హెచ్‌ 16 స్పెషల్‌ డిప్యూ టీ కలెక్టర్‌ ఎం.వి సూర్యకళ స్పష్టం చేశారు.

అవకతవకలకు ఆస్కారం లేకుండా పరిహారం
క్లయిమ్‌లు పరిశీలిస్తున్న ఎస్‌డీసీ సూర్యకళ

పెందుర్తి, డిసెంబరు 3: పోర్టు కనక్టెవిటీ రోడ్డు నిర్మాణంలో నరవ గ్రామం సర్వే నంబరు 54లో భూములు కోల్పోయిన వారికి నష్ట పరిహారం అందజేసే విషయంలో ఎలాంటి అవకతవకలకూ ఆస్కారం లేదని ఎన్‌హెచ్‌ 16 స్పెషల్‌ డిప్యూ టీ కలెక్టర్‌ ఎం.వి సూర్యకళ స్పష్టం చేశారు. చెల్లింపుల్లో అభ్యంతరాలుంటే హక్కుదారులు క్లెయిమ్‌ చేసుకోవచ్చునన్నారు. తహసీల్దార్‌ కార్యాలయంలో గురువారం క్లయిమ్‌లను స్వీకరించారు. సర్వే నంబరు 54లో 2.5 ఎకరాల భూముల్లో దుర్వినియోగం జరిగిందని కొంతమంది జాయింట్‌ కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారన్నారు  గ్రామసభకు హక్కుపత్రాలతో  హాజరుకావాలని, రికార్డులు పరిశీలించి వాస్తవాలు నిర్ధారిస్తామన్నారు.


Updated Date - 2020-12-04T04:28:42+05:30 IST