టీఆర్‌ఎ్‌సతోనే పోటీ

ABN , First Publish Date - 2022-08-12T06:11:42+05:30 IST

మునుగోడు ఉప ఎన్నిలో బీజేపీ పోటీనే కాదని, ఆ పార్టీకి డిపాజిట్‌ కూడా రాదని, టీఆర్‌ఎ్‌సతోనే తమ పోటీ అని కాంగ్రెస్‌ నియోజకవర్గ నేత చల్లమల్ల కృష్ణారెడ్డి అన్నారు.

టీఆర్‌ఎ్‌సతోనే పోటీ
సమావేశంలో మాట్లాడుతున్న కృష్ణారెడ్డి

 బీజేపీకి డిపాజిట్‌ గల్లంతే 

కాంగ్రెస్‌ నాయకుడు చల్లమల్ల కృష్ణారెడ్డి

చౌటుప్పల్‌ రూరల్‌, ఆగస్టు 11: మునుగోడు ఉప ఎన్నిలో బీజేపీ పోటీనే కాదని, ఆ పార్టీకి డిపాజిట్‌ కూడా రాదని, టీఆర్‌ఎ్‌సతోనే తమ పోటీ అని కాంగ్రెస్‌ నియోజకవర్గ నేత చల్లమల్ల కృష్ణారెడ్డి అన్నారు. యాదాద్రి జిల్లా జైకే సారం, నేలపట్ల గ్రామాల్లో గురువారం నిర్వహించిన పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం అనంతరం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆజాదీకా గౌరవ్‌ యాత్ర ఈ నెల 13న నారాయణపురం మండలంలో కొనసాగుతుందని, ఈ కార్యక్రమానికి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి హాజరవుతారని తెలిపారు. 16వ తేదీ నుంచి నియోజకవర్గంలో రేవంత్‌రెడ్డి పర్యటిస్తారని, ప్రతీరోజు రెండు మండలాల ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొంటారన్నారు. పదో తరగతి నుంచే కాంగ్రెస్‌ జెండా పట్టుకున్న తాను నియోజకవర్గంలో కొంత మంది ఎమ్మెల్యేల గెలుపులో ముఖ్యపాత్ర పోషించానని తెలిపారు. నియోజకవర్గంలో రాజగోపాల్‌రెడ్డి వారం రోజుల నుంచి తిరుగుతున్నారని, మూడేళ్లుగా ఈ పనిచేసి ఉంటే ఈ ప్రాంతం కొంతైనా అభివృద్ధి చెంది ఉండేదన్నారు. రాజగోపాల్‌రెడ్డి వెంట వెళ్లేందుకు కార్యకర్తలు గొర్రెలు కాదన్నారు. కార్యకర్తలు వెంట రాకపోవడంతో అయోమయంలో పడిన రాజగోపాల్‌రెడ్డి ప్రలోభాలకు గురిచేస్తూ సర్పంచ్‌కు రూ.20లక్షలు ఇస్తానని మోసపూరిత హామీలు ఇస్తున్నాడని ఆరోపించారు. పాల్వాయి స్రవంతి మాటలను వక్రీకరించారని, రాజగోపాల్‌రెడ్డి అనుచురులే ఆ ఆడియోను లీక్‌ చేశారని ఆరోపించారు. పార్టీలో ఎలాంటి విభేదాలు లేవని, కార్యకర్తలకు ఎలప్పుడూ అందుబాటులో ఉంటానన్నారు. రాష్ట్రం లో కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డిపై ఉన్నంత వ్యతిరేకత ఏ అ భ్యర్థికి లేదన్నారు. వామపక్షభావాలున్న మునుగోడులో బీజే పీ గెలుపు అసాధ్యమని, కాంగ్రెస్‌ జెండా ఎగరడం ఖాయమన్నారు. సమావేశంలో సర్పంచ్‌లు కొర్పూరి సైదులు, చౌట వేణుగోపాల్‌, ఎంపీటీసీ శ్రీశైలం, నాయకులు ఆకుల శ్రీకాంత్‌, యమున, అంజిరెడ్డి, సత్యనారాయణ, పాల్గొన్నారు.

Updated Date - 2022-08-12T06:11:42+05:30 IST