విద్యార్థులలో పోటీతత్వం పెరగాలి

ABN , First Publish Date - 2022-08-09T05:57:41+05:30 IST

విద్యార్థులలో పోటితత్వం పెరగాలని ఎస్పీ మలికగ ర్గ్‌ పేర్కొన్నారు. సోమవారం స్థానిక పోలీసు కల్యాణ మండపంలో ఆజాదీ కా అమృత్‌ మహోత్సవంలో భాగంగా విద్యార్థులకు పెయింటింగ్‌ పోటీలు నిర్వహించారు. విద్యార్థులు వేసిన పెయింటింగ్‌లను ఎస్పీ పరిశీలించారు. విద్యార్థుల్లో పోటీతత్వం పెంపొందించేందుకు ఇలాంటి పోటీలు దోహద పడతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఆర్‌ఏఎస్పీ అశోక్‌ బాబు, ఎస్బీ డీఎస్పీ మరియదాసు, తాలుకా ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాసరెడ్డి, ఆర్‌ఐ శ్రీహరి తదితరులు తెలిపారు.

విద్యార్థులలో పోటీతత్వం పెరగాలి
విద్యార్థులు వేసిన పెయింటింగ్‌లను పరిశీలిస్తున్న ఎస్పీ మలికగర్గ్‌

ఒంగోలు( క్రైం):ఆగస్టు8: విద్యార్థులలో పోటితత్వం పెరగాలని ఎస్పీ మలికగ ర్గ్‌ పేర్కొన్నారు. సోమవారం స్థానిక పోలీసు కల్యాణ మండపంలో ఆజాదీ కా అమృత్‌ మహోత్సవంలో భాగంగా విద్యార్థులకు పెయింటింగ్‌ పోటీలు నిర్వహించారు.  విద్యార్థులు వేసిన పెయింటింగ్‌లను ఎస్పీ పరిశీలించారు. విద్యార్థుల్లో పోటీతత్వం పెంపొందించేందుకు ఇలాంటి పోటీలు దోహద పడతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఆర్‌ఏఎస్పీ అశోక్‌ బాబు, ఎస్బీ డీఎస్పీ మరియదాసు, తాలుకా ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాసరెడ్డి, ఆర్‌ఐ శ్రీహరి తదితరులు తెలిపారు.

 నకిలీ ఏజెంట్ల మాట నమ్మవద్దు

విదేశాలలో ఉపాధి కల్పిస్తామని ఆశ చూపి డబ్బు కాజేస్తున్న నకిలీ రిక్రూట్‌మెంట్‌ ఏజెంట్ల మాటలు నమ్మి మోసపోవద్దని ఎస్పీ మలికగర్గ్‌ సోమవారం ఓ ప్రకటనలో కోరారు. కువైట్‌ రాయబార కార్యాలయంలో అనేక మంది మోసపోయామని వాపోతున్నటు తెలుస్తున్నదని అన్నారు.సరైన పత్రాలు లేకుండా నకిలీ ఏజెంట్లు కొంత మందిని విదేశాలకు పంపించినట్లు తెలిసిందన్నారు. రిజిస్టర్‌  అయిన రిక్రూటింగ్‌ ఏజెంట్ల ద్వారా మాత్రమే విదేశాలకు వెళ్లాలని కోరారు. ఇలాంటి నకిలీ ఏజెంట్లకు సంబంధించి సమాచారం ఉంటే ఎస్బీ డీఎస్పీ 9121102104 కు సమాచారం ఇవ్వాలని కోరారు. 

 

Updated Date - 2022-08-09T05:57:41+05:30 IST