ప్రియుడు మోసగించాడని ఫిర్యాదు

ABN , First Publish Date - 2021-03-07T04:02:45+05:30 IST

ప్రేమించాడు.. తోడుగా ఉంటానని నమ్మించి తాలికట్టాడు.. తీరా కులం సమస్య అడ్డుచెప్పి ఆ యువతిని వదిలేసి ప్రియుడు పరారయ్యాడు.

ప్రియుడు మోసగించాడని ఫిర్యాదు

నర్వ, మార్చి 6 : ప్రేమించాడు.. తోడుగా ఉంటానని నమ్మించి తాలికట్టాడు.. తీరా కులం సమస్య అడ్డుచెప్పి ఆ యువతిని వదిలేసి ప్రియుడు పరారయ్యాడు. దీంతో తనకు న్యాయం చేయాలని సదరు యువతి ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ ఎం.డి. నవీద్‌ తెలిపారు. వివరాల్లోకి వెళ్తే... మండలంలోని ఓ గ్రామానికి చెందిన ఓ  యువకుడు అదే గ్రామానికి చెందిన మరో వర్గానికి చెందిన  యువతిని నాలుగేళ్లుగా ప్రేమించి రెండు నెలల క్రింతం హైదారాబాద్‌ పెద్దమ్మగుడిలో తాళికట్టి పెళ్లి చేసుకున్నాడు. ఇంతలోనే కులం వేరని 15రోజుల నుంచి ఆ అమ్మాయిని వద్దనుకొని వదిలిపెట్టి వెళ్లాడు. పరారీలో ఉన్న యువకుడిపై ఆ యువతి వారం రోజుల క్రితం నర్వ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఎంతకీ ఆ యువకుడు వినకపోవడంతో శనివారం కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు. 

Updated Date - 2021-03-07T04:02:45+05:30 IST