
నెల్లూరు: జిల్లాలోని వెంకటగిరి సీఐ నాగమల్లేశ్వరరావుపై డీజీపీ, నెల్లూరు ఎస్పీకి రాజధాని పరిరక్షణ సమితి న్యాయవాది వీవీ లక్ష్మీనారాయణ ఫిర్యాదు చేశారు. ఇరువురికి లీగల్ నోటిసులు పంపారు. జిల్లాలో జరుగుతున్న రైతుల మహాపాదయాత్ర సందర్భంగా రక్షణగా ఉన్న సెక్యూరిటీ సిబ్బందిపై విచక్షణా రహితంగా దాడి చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గాయాలపాలైన సెక్యూరిటీ గార్డు విజవల్ను కూడా పంపారు.
నెల్లూరు జిల్లాలో జరుగుతున్న మహాపాదయాత్రలో వెంకటగిరి సీఐ నాగమల్లేశ్వరరావు ఓవరాక్షన్ చేసిన సంగతి తెలిసిందే. అడుగడుగునా సీఐ నాగమల్లేశ్వరరావు అడ్డంకులు కల్పించారు. మార్షల్ శివపై దాడి చేశారు. శివను ఆసుపత్రికి తరలించారు. సీఐ నాగమల్లేశ్వరరావుతో రైతులకు వాగ్వాదం జరిగింది. కొద్దిసేపు అక్కడ ఉద్రిక్తత నెలకొంది.