AP News: గవర్నర్‌తో టీడీపీ నేతల భేటి - కుప్పం ఘటనలపై ఫిర్యాదు

ABN , First Publish Date - 2022-08-26T18:37:55+05:30 IST

అమరావతి: రాష్ట్రంలో వైసీపీ (YSRCP) అరాచక పాలన, టీడీపీ (TDP) కార్యకర్తలపై దాడులు, హత్యల నేపథ్యంలో టీడీపీ నాయకులు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌ (Governor Biswa Bhusan Harichandan)ను కలిశారు. కుప్పం(Kuppam)లో వైసీపీ శ్రేణులు వ్యవహరించిన తీరు, అన్న క్యాంటీన్ ధ్వంసం చేయడాన్ని గవర్నర్‌కు వివరించారు. సమావేశం ముగిశాక టీడీపీ నేతలు మాట్లాడారు. తాము ప్రస్తావించిన అంశాలపై గవర్నర్‌

AP News: గవర్నర్‌తో టీడీపీ నేతల భేటి - కుప్పం ఘటనలపై ఫిర్యాదు

అమరావతి: రాష్ట్రంలో వైసీపీ (YSRCP) అరాచక పాలన, టీడీపీ (TDP) కార్యకర్తలపై దాడులు, హత్యల నేపథ్యంలో టీడీపీ నాయకులు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌ (Governor Biswa Bhusan Harichandan)ను కలిశారు. కుప్పం(Kuppam)లో వైసీపీ శ్రేణులు వ్యవహరించిన తీరు, అన్న క్యాంటీన్ ధ్వంసం చేయడాన్ని గవర్నర్‌కు వివరించారు. సమావేశం ముగిశాక టీడీపీ నేతలు మాట్లాడారు. తాము ప్రస్తావించిన అంశాలపై గవర్నర్‌ స్పందించడం లేదని అసహనం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యల పరిష్కారంపై గవర్నర్ దృష్టి పెడుతున్నట్లు కనిపించడం లేదని పేర్కొన్నారు.


గవర్నర్‌ను చాలా సందర్భాల్లో కలిశాం.

‘‘ఏపీలో ఎస్సీలపై పెరిగిపోతున్న దాడులపై గవర్నరుకు వివరించాం. దళితులపై దాడులు చేయడం తమ పెటెంట్ అని వైసీపీ భావిస్తున్నట్లుంది. దళితులకు స్వేచ్ఛగా జీవించే హక్కు లేదు. గవర్నరును చాలా సందర్భాల్లో కలిశాం. ప్రయోజనం ఉండడం లేదు. జగన్ వచ్చినప్పుడల్లా గవర్నరుకు ఏం చెబుతున్నారో..? ఏమో..? ప్రజా సమస్యల పరిష్కారంపై గవర్నర్ ఫోకస్ పెడుతున్నట్టు కన్పించడం లేదు.’’ 

- నక్కా ఆనంద్ బాబు (Nakka Anand Babu), టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు 


కుప్పం ఘటనపై  విచారణ జరిపించాలని కోరాం

‘‘ఏపీలో అటవిక రాజ్యం నడుస్తోంది. కుప్పంలో జరిగిన ఘటనలపై వైసీపీ నేతలు కూడా అసహ్యించుకుంటున్నారు. మేం చిన్న రిప్రజెంటేషన్ ఇవ్వాలనుకుంటే.. మమ్మల్ని హౌస్ అరెస్టులు చేస్తారా..? అన్న క్యాంటీనుపై దాడి చేసి తినే అన్నాన్ని లాగేస్తారా..? కుప్పం ఘటనపై  విచారణ చేయిస్తానని గవర్నర్ హామీ ఇచ్చారు.’’

- వర్ల రామయ్య (Varla Ramaiah), టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు.

Updated Date - 2022-08-26T18:37:55+05:30 IST