దళితులపై అనుచిత వ్యాఖ్యలు.. folk singer Yogesh Gadhvi పై కేసు

ABN , First Publish Date - 2022-05-16T19:56:31+05:30 IST

దీని ప్రారంభోత్సవ కార్యక్రమం బీజేపీ నేతృత్వంలో జరిగింది. ఈ కార్యక్రమానిక గుజరాత్ అసెంబ్లీ స్పీకర్ నిమాబెన్ ఆచార్య, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సీఆర్ పాటిల్, జనరల్ సెక్రెటరీ అండ్ ఎంపీ వినోద్ చద్వ, ఇతర ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. వీరందరి సమక్షంలో దళితులపై గద్వి అనుచిత వ్యాఖ్యలు చేయడం గమనార్హం..

దళితులపై అనుచిత వ్యాఖ్యలు.. folk singer Yogesh Gadhvi పై కేసు

గాంధీనగర్: దళితులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన folk singer Yogesh Gadhvi పై కేసు నమోదు అయింది. ఆయన దళితులపై పలుమార్లు అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు విశాల్ గర్వ అనే దళిత హక్కుల కార్యకర్త ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. గుజరాత్‌లోని కచ్ జిల్లా బుజ్‌లో ఆదివారం భీంరత్న సమ్రాస్ కన్య విద్యాలయ అనే పేరుతో నిర్మించిన బాలికల హాస్టల్ ప్రారంభోత్సవానికి గద్వి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఆయన సంగీతం కచేరి నిర్వహించారు. ఆ సందర్భంలో ఆయన దళితులను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారు.


ఈ హాస్టల్‌ను సమ్రాస్ ఛత్రాలయ్ సొసైటీ నిర్మించింది. అణగారిన విద్యార్థులకు (SC, ST, OBC, ఆర్థికంగా వెనుకబడినవారు) సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా 2016లో రాష్ట్ర ప్రభుత్వ సామాజిక న్యాయం మరియు సాధికారత విభాగం క్రింద నిర్మించారు. ఇందులో జిల్లా స్థాయి సదుపాయాలు ఉంటాయి. దీని ప్రారంభోత్సవ కార్యక్రమం బీజేపీ నేతృత్వంలో జరిగింది. ఈ కార్యక్రమానిక గుజరాత్ అసెంబ్లీ స్పీకర్ నిమాబెన్ ఆచార్య, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సీఆర్ పాటిల్, జనరల్ సెక్రెటరీ అండ్ ఎంపీ వినోద్ చద్వ, ఇతర ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. వీరందరి సమక్షంలో దళితులపై గద్వి అనుచిత వ్యాఖ్యలు చేయడం గమనార్హం.


గద్వి.. తాను వేదికపై ఉన్న సమయంలో పలుమార్లు దళితులపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. కార్యక్రమంలో ఉన్న దళిత నేతలు గద్విని అడ్డుకుని మందలించారు. తమ బిడ్డల కోసం నిర్మించిన హాస్టల్ ప్రారంభోత్సవంలో ఇలాంటి వ్యాఖ్యలేంటని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. గద్విపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేసినట్లు స్థానిక పోలీసులు తెలిపారు.

Updated Date - 2022-05-16T19:56:31+05:30 IST