హుజురాబాద్‌లో డబ్బు పంపిణీపై హెచ్చార్సీలో ఫిర్యాదు

ABN , First Publish Date - 2021-10-28T02:11:21+05:30 IST

హుజురాబాద్ ఉప ఎన్నికల్లో డబ్బులు, మద్యం పంపిణీపై రాష్ట్ర

హుజురాబాద్‌లో డబ్బు పంపిణీపై హెచ్చార్సీలో ఫిర్యాదు

హైదరాబాద్: హుజురాబాద్ ఉప ఎన్నికల్లో డబ్బులు, మద్యం పంపిణీపై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు అందింది. డబ్బులు, మద్యం పంపిణీపై  హైకోర్టు న్యాయవాది సయ్యద్ సలీమ్ హెచ్చార్సీ లో ఫిర్యాదు చేసారు. హుజురాబాద్ ఉపఎన్నికల ప్రచారం బుధవారం ముగియడంతో ఓటర్లకు రాజకీయ పార్టీలు డబ్బులు ఆశ చూపి మభ్యపెడుతున్నారని ఆయన పేర్కొన్నారు. ఓటుకు ఆరు వేలు ఇస్తున్నారంటూ సామాజిక మాధ్యమాల్లో పలు వీడియోలు చక్కర్లు కొడుతున్నాయన్నారు. అయినా అధికారులు, పోలీస్ యంత్రాంగం మాత్రం చోద్యం చూస్తుందన్నారు. 


ప్రజాస్వామ్యబద్దంగా జరగాల్సిన ఎన్నికలు, ఇలా ఓటుకు నోటు చందంగా జరగడం చాలా ప్రమాదకరమన్నారు. ఇప్పటికైనా ఎన్నికలు పూర్తైయ్యే వరకు పోలీసులు, ఎన్నికల కమిషన్ సమర్థవంతంగా విధులు నిర్వహించే విధంగా ఆదేశాలు జారీ చేయాలని హెచ్చార్సీని న్యాయవాది సయ్యద్ కోరారు. 

 

Updated Date - 2021-10-28T02:11:21+05:30 IST