మునిసిపాలిటీలో అవినీతిపై విజిలెన్స్‌ డీజీకి ఫిర్యాదు

ABN , First Publish Date - 2022-09-27T06:59:50+05:30 IST

మునిసిపాలిటీలో డీజిల్‌ బిల్లులు నెలకు రూ.3లక్షలు అదనంగా ఖర్చు చూపిస్తున్నారని ఆరోపిస్తూ 9వ వార్డు కౌన్సిలర్‌ అద్దెపల్లి సౌజన్య, జనసేన నాయకుడు గణేశ్‌తో కలిసి విజయవాడలోని విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ జనరల్‌ బాక్షికి ఫిర్యాదు చేశారు.

మునిసిపాలిటీలో అవినీతిపై విజిలెన్స్‌ డీజీకి ఫిర్యాదు
విజిలెన్స్‌ డీజీ బాక్షికి ఫిర్యాదు చేస్తున్న 9వ వార్డు కౌన్సిలర్‌ అద్దెపల్లి సౌజన్య, జనసేన నాయకులు



నర్సీపట్నం, సెప్టెంబరు 26: మునిసిపాలిటీలో డీజిల్‌ బిల్లులు నెలకు రూ.3లక్షలు అదనంగా ఖర్చు చూపిస్తున్నారని ఆరోపిస్తూ 9వ వార్డు కౌన్సిలర్‌ అద్దెపల్లి సౌజన్య, జనసేన నాయకుడు గణేశ్‌తో కలిసి విజయవాడలోని విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ జనరల్‌ బాక్షికి ఫిర్యాదు చేశారు. గత ఏడాది మునిసిపల్‌ ఎన్నికల ఖర్చు రూ.25 లక్షలు బిల్లులు చేసుకున్నారని, ఇప్పుడు మరో రూ.10 లక్షలు బిల్లు చేసుకున్నారని ఫిర్యాదు చేశారు. మూడు ట్రాక్టర్లు అద్దెకు తీసుకొని సంవత్సరానికి రూ.32 లక్షలు చెల్లిస్తున్నారని, ఈ డబ్బుతో కొత్త ట్రాక్టర్లు కొనుగోలు చేయవచ్చునని తెలిపారు. పూర్తి స్థాయిలో విచారణ చేసి అవినీతిపై చర్యలు తీసుకోవాలని కోరారు.

Updated Date - 2022-09-27T06:59:50+05:30 IST